
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని, బీసీలకు 42శాతం రిజర్వేషన్ వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం మహబూబాబాద్తహసీల్దార్ ఆఫీసు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహారదీక్షలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో 56శాతం ఉన్న బీసీలు 42శాతం రిజర్వేషన్ కల్పించడంలో తప్పేముందని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీలపై బీజేపీ చేస్తున్న నాటకాన్ని ఎండగడుతామని, తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. దీక్షలో సీపీఎం లీడ్లరు సమ్మెట రాజమౌళి, సూర్నపు సోమయ్య, గునిగంటి రాజన్న, ఆకుల రాజు, అల్వాల వీరయ్య, శ్రీనివాస్, ఉపేందర్, సీతారాంనాయక్, రావుల రాజు తదితరులున్నారు.