బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను కూడగడ్తం 

బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను కూడగడ్తం 

సీపీఎం పొలిట్​ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు 
 

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యవస్థను, ఫెడరల్ సిస్టంను కాపాడేందుకు.. కలిసొచ్చే పార్టీలను సమీకరించి ఉద్యమాన్ని రూపొందించాలని పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వెల్లడించారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోళ్ల పరిణామాలపై చర్చించినట్లు తెలిపారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బుతో ఎర వేయాలని బీజేపీ చూసిందని, ఈ వ్యవహారాన్ని సీపీఎం తీవ్రం గా ఖండిస్తోందని చెప్పారు. బీజేపి ప్రాంతీయ పార్టీలని విచ్ఛిన్నం చేయాలని చూస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా డబ్బుతో కొనుగోలు చేయొచ్చని ఆ పార్టీ భావిస్తోందని ఫైర్ అయ్యారు.