లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్‌ ఇవ్వాలి : తుమ్మల వీరారెడ్డి

లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు  ప్రొసీడింగ్ ఆర్డర్స్‌ ఇవ్వాలి : తుమ్మల వీరారెడ్డి
  • సీపీఎం జిల్లా కార్యదర్శి  తుమ్మల వీరారెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండలో నిర్మించిన 552 డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు వెంటనే ప్రోసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఇండ్లను స్వాధీన పరచాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నల్గొండలోని కలెక్టరేట్ ఎదుట డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. హౌసింగ్ డీఎం రాజ్‌కుమార్, ఆర్డీఓ అశోక్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన 2017లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శిథిలావస్థకు చేరుతున్నాయని వాటిని లాటరీ ద్వారా ఎంపిక చేసి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.  

రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 33 ద్వారా ఈ నెలాఖరు నాటికి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్వాధీన పరుస్తామని హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, ఆర్డీఓ అశోక్ రెడ్డి తెలిపారు.  సీపీఎం జిల్లా  నాయకులు సయ్యద్ హాషం, ఎండీ సలీం, పి. నర్సిరెడ్డి, సత్తయ్య, రవీందర్ , పద్మ, మధుసూదన్ రెడ్డి, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పోరాట సాధన కమిటీ సభ్యులు గంజి రాజేష్, సిరాజుద్దీన్, కీసరి ప్రశాంతి, గౌసియా, విజయలక్ష్మి , రజిని, ధనమ్మ, పాల్గొన్నారు.