రైతాంగ పోరాట చరిత్రను బీజేపీ, టీఆర్ఎస్ మారుస్తున్నయ్

రైతాంగ పోరాట చరిత్రను బీజేపీ, టీఆర్ఎస్ మారుస్తున్నయ్

వరంగల్: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు  బృందా కారత్  అన్నారు. ఇవాళ హన్మకొండలో నిర్వహించిన సీపీఎం బహిరంగ సభలో  బృద కారత్ పాల్గొన్నారు. అంనంతరం ఆమె మాట్లాడుతూ... తన పంటను విస్నూర్ దేశ్ ముఖ్ రాంచంద్రారెడ్డి నుంచి కాపాడుకోవడానికి ఐలమ్మ వీరోచిత పోరాటం చేసిందని కొనియాడారు. ఆమె పోరాటానికి ఆంధ్ర మహా సభ అండగా నిలిచిందన్నారు. ఐలమ్మ పోరాటం 3 వేల గ్రామాలకు పాకి పెద్ద తెలంగాణ రైతాంగ సాయుధంగా పోరాటంగా మారిందని చెప్పారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ చరిత్రను మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రైతాంగ ఉద్యమాన్ని హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించేందుకు కుట్రలు పన్నుతున్నాయని బీజేపీ, టీఆర్ఎస్ పై మండిపడ్డారు.

నిజాం రాజుకు వ్యతిరేకంగా అప్పటి కమ్యూనిస్టులు పోరాడారని, అయితే నిజాం రాజును కాపాడేందుకు నెహ్రూ భారత సైన్యాన్ని హైదరాబాద్ కు పంపి వందల కొద్దీ కమ్యూనిస్టులను హతమార్చారని తెలిపారు.నిజాంపైన జరిగిన పోరాటం మతం ప్రాతిపదికన జరగలేదని, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆనాడు ముస్లింలు కూడా పోరాడారని గుర్తు చేశారు. ఇవాళ ఇళ్ళ స్థలాల కోసం చేస్తున్న పోరాటంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఉన్నారన్న బృందా కారత్.. ఐలమ్మ స్ఫూర్తిగా పోరాడాలని పిలుపునిచ్చారు.