జమ్మికుంట హాస్పిటల్‌‌లో ‘ఊయల’ ప్రారంభం 

జమ్మికుంట హాస్పిటల్‌‌లో ‘ఊయల’ ప్రారంభం 

జమ్మికుంట, వెలుగు: పుట్టిన శిశువులను వద్దనుకునే తల్లిదండ్రులు.. హాస్పిటళ్లలో ఏర్పాటు చేసిన ఊయల సెంటర్‌‌‌‌లో అందజేయాలని కరీంనగర్‌‌‌‌ జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి సూచించారు. జమ్మికుంట హాస్పిటల్‌‌లో ఏర్పాటు చేసిన ఊయల(క్రెడిల్‌‌ బేబీ రిసెప్షన్‌‌ సెంటర్‌‌‌‌)ను డిప్యూటీ డీఎంహెచ్‌‌వో చందు, సూపరింటెండెంట్‌‌ శ్రీకాంత్ రెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాథ శిశువుల ప్రాణాలకు ప్రభుత్వం ఊయల ద్వారా ప్రాణంపోస్తోందన్నారు. పిల్లలు వద్దనుకునేవారు 94908 81098కు ఫోన్‌‌ చేసి నిర్వాహకులకు నేరుగా అందజేయొచ్చన్నారు. పిల్లలు లేని తల్లిదండ్రులు ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేసుకుంటే చట్టప్రకారం దత్తత ఇస్తామన్నారు.