"కాలచక్రం"లో ప్రభాస్.. సోషల్ మీడియాలో వైరలవుతున్న న్యూస్

"కాలచక్రం"లో ప్రభాస్..  సోషల్ మీడియాలో వైరలవుతున్న న్యూస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా చేస్తున్న ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రాజెక్ట్-కే(Project-K). అమితాబ్(Amitab),కమల్ హాసన్(Kamal haasan), దీపికా పదుకోన్(Deepika padukone) వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు.. ఇండియా మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. 

అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ ఐనా క్షణాల్లో వైరల్ గా మారుతోంది. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ అండ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను సాన్ డియాగో కామిక్ కాన్ ఫెస్టివల్ లో ప్రకటించనున్నారు మేకర్స్. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ ఘనత సాధిచిన మొదటి తెలుగు సినిమాగా ప్రాజెక్ట్ కే రికార్డ్ క్రియేట్ చేసింది. 

ఇక ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి ప్రాజెక్ట్ కే లో కే  అంటే ఏంటని సర్చింగ్ మొదలుపెట్టారు నెటిజన్స్. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం కే అంటే కాలచక్రం అని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే సినిమా స్కై ఫై ఎలిమెంట్స్ తో, టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రానుంది. అందుకే.. స్టోరీ లైన్ కు యాప్ట్ అయ్యేలా కాలచక్రం అనే టైటిల్ ను ఫిక్స్ ఆయారట మేకర్స్. ఇక ఫ్యాన్స్ నుండి కూడా పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇదే టైటిల్ ను వేదికపై ప్రకటించనున్నారట మేకర్స్. మరి భారీ బడ్జెట్ తో, పాన్ వరల్డ్ రేంజ్ లో రానున్న ఈ సినిమా ప్రభాస్ కూడా ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుంది అనేది చూడాలి.