పవన్ కొత్త సినిమా కోసం క్రేజీ టైటిల్

పవన్ కొత్త సినిమా కోసం క్రేజీ టైటిల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. కెరీర్ లో ఎన్నడూ లేని విదంగా ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తూ ఫ్యాన్స్ కి అప్డేట్స్ మీద అప్డేట్స్ ఇస్తున్నాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక తాజాగా మరో అప్డేట్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్.

అదేంటంటే.. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాల్లో సముద్రఖని సినిమా ఒకటి. తమిళ సినిమా వినోదయ సీతమ్ కి ఇది రీమేక్. ఈ సినిమాలో పవన్ మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా  జరుగుతోంది. పవన్ దేవుడిగా కనిపించనున్న ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో  రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. దేవుడు అని, దేవర అని.. ఇలా చాలా పేర్లే తెరపైకి వచ్చాయి.

ఇక తాజాగా మరో ఇంట్రెస్టింగ్ టైటిల్  ఈ లిస్టులోకి చేరిపోయింది. ఈ సినిమా కోసం "దేవుడే దిగివచ్చినా" అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారట మేకర్స్. ఈ టైటిల్ అయితేనే కథకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని భావిస్తున్నారట. ఆల్మోస్ట్ ఇదే టైటిల్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.