
హైదరాబాద్, వెలుగు: క్రెడాయ్ తెలంగాణ సిటీలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో తమ కొత్త ఆఫీస్‌ను గురువారం ఓపెన్ చేసింది. రాష్ట్ర ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఈ ఆఫీస్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, దీంతో రియల్ ఎస్టేట్ సెక్టార్ అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫార్మా సిటీ తొందరలో ఓపెన్ అవుతుందని, టెక్స్‌టైల్ పార్క్‌లో ఒక కంపెనీ ఇప్పటికే వచ్చిందని అన్నారు. మరో కంపెనీ ప్లాంట్ నిర్మాణంలో ఉందని చెప్పారు. కొంగరు కొలన్‌లో ఫాక్స్‌కాన్ వేగంగా రెడీ అవుతోందని అన్నారు. భారీగా ఇన్వెస్ట్‌మెంట్లు వస్తున్నాయని, రియల్ ఎస్టేట్ సెక్టార్ కీలకమని పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌లో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలోని ఎత్తైన బిల్డింగ్‌లలో 8 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయని తాజాగా ఓ రిపోర్ట్ పేర్కొంది. రానున్న కొన్నేళ్లలో హైదరాబాద్ అన్ని ఇండికేషన్లలో ఇండియాలోనే టాప్‌లో ఉంటుందన్న నమ్మకం ఉంది. కేటీఆర్ తాజా యూఎస్ పర్యటనతో 45 వేల డైరెక్ట్ ఉద్యోగాలు వచ్చాయి. ఇన్‌డైరెక్ట్‌గా ఎన్ని క్రియేట్ అవుతాయో ఊహించుకోండి’ అని అన్నారు. 2014 తర్వాత నుంచి హైదరాబాద్ వేగంగా విస్తరించడాన్ని చూస్తున్నామని క్రెడాయ్ చైర్మన్ రామచంద్రా రెడ్డి అన్నారు. పెట్టుబడులకు అనువైన కేంద్రంగా హైదరాబాద్ ఎదిగిందని చెప్పారు. ప్రభుత్వం వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట్, మహబూబ్‌నగర్ జిల్లాలలో ఐటీ పార్క్‌లను కడుతోందని పేర్కొన్నారు. టైర్ 1, 2 సిటీలు అభివృద్ధి చెందితే కొత్త జాబ్‌లు క్రియేట్ అవుతాయని, ఫలితంగా రియల్ ఎస్టేట్ సెక్టార్‌కు మేలు జరుగుతుందని అన్నారు.
జిల్లాలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్‌ను ప్రభుత్వం డెవలప్ చేస్తుండడంతో మరిన్ని ఇండస్ట్రీయల్ కారిడార్లు క్రియేట్ అవుతాయని క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ మురళి కృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌డీపీతో డిస్ట్రిక్ట్‌లకు కనెక్టివిటీ మెరుగుపడుతుందన్నారు. ప్రస్తుతం క్రెడాయ్‌కు రాష్ట్రంలో 15 చాప్టర్‌లు ఉన్నాయని చెప్పారు. వరంగల్‌తో సహా వివిధ జిల్లాలలో గ్రోత్ చూస్తున్నామని క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ (ఎలక్ట్) ఈ ప్రేమ్‌సాగర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం తెస్తున్న పాలసీలు, డీసెంట్రలైజ్డ్ డెవలప్‌మెంట్ విధానాలతో టైర్ 2 సిటీలలో కూడా ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయని అన్నారు. ఇది రియల్ ఎస్టేట్ సెక్టార్‌కు మేలు చేస్తుందని చెప్పారు. కొత్త క్రెడాయ్ ఆఫీస్‌లో ట్రెయినింగ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్‌తో పాటు కేబిన్స్ కూడా ఉంటాయి. క్రెడాయ్ తెలంగాణ మెంబర్ల కోసం ట్రెయినింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లను ఇక్కడ నిర్వహిస్తారు.