
ఢిల్లీ : దక్షిణ కొరియా ఆటో మేకర్ హ్యుండై సరికొత్త ఫీచర్లతో క్రెటా కొత్త మోడల్‌ను ఇండియా మార్కెట్‌కు తీసుకొచ్చింది. ఢిల్లీలో దీనిని సోమవారం లాంచ్ చేసింది. ఇది పెట్రోల్, డీజిల్, కప్పా టర్బో పెట్రోల్ బీఎస్-6 ఇంజన్లతో లభిస్తాయి. ఈ మోడల్‌లో అండ్రాయిడ్ ఆటోప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, హెచ్‌డీ ఇన్ఫోటేన్‌మెంట్, బోస్ ప్రీమియం సౌండ్, ఆటో హెల్దీ ఎయిర్ ప్యూరిఫయర్ వంటి పీచర్లు ఉన్నాయి. ధరలు రూ.పది లక్షల నుంచి రూ.17.50 లక్షల వరకు ఉంటాయి.