క్రూ మూవీ ట్రైలర్‌‌‌‌ విడుదల

క్రూ మూవీ ట్రైలర్‌‌‌‌ విడుదల

కరీనా కపూర్ ఖాన్‌‌, కృతిసనన్‌‌, టబు లీడ్ రోల్స్‌‌లో తెరకెక్కుతున్న హిందీ చిత్రం ‘క్రూ’. ఏక్తాకపూర్‌‌, రియాకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘లూట్‌‌కేస్’ ఫేమ్ రాజేష్ కృష్ణన్ దర్శకుడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్‌‌‌‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. టబు, కరీనా, కృతి ఎయిర్‌‌‌‌ హోస్టెస్‌‌గా వర్క్ చేస్తుంటారు.

ఈ ముగ్గురి జీవితంలోనూ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. మరోవైపు వీళ్లు పనిచేస్తున్న ఎయిర్‌‌‌‌లైన్స్ సంస్థ దివాళా తీస్తుంది. అదే టైమ్‌‌లో గోల్డ్ స్మగ్లింగ్‌‌ చేస్తున్న వ్యక్తి నుంచి వీళ్లు బంగారు బిస్కెట్స్‌‌ దొంగతనం చేశారు. అది మొదలు వీళ్ల జీవితాల్లో కొత్త సమస్యలు మొదలవుతాయి. వాటన్నింటినీ ఫన్నీగా చూపించారు. ఈ బ్యాక్‌‌డ్రాప్‌‌లో వచ్చే ట్విస్టులు, సిచ్యువేషనల్‌‌ కామెడీతో పాటు ముగ్గురు హీరోయిన్స్‌‌ గ్లామర్, కామిక్ టైమింగ్‌‌ ఆకట్టుకున్నాయి.

ఇప్పటివరకూ ఇద్దరు లేదా ముగ్గురు హీరోలు చేసిన కామెడీ చేస్తే చూశాం. అందుకు భిన్నంగా హీరోయిన్స్‌‌ చేత ఇందులో కామెడీ చేయించడం ఇంప్రెస్ చేసింది. పంజాబీ నటుడు దిల్జీజ్‌‌ దోసాంజ్‌‌, కపిల్ శర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. మార్చి 29న సినిమా విడుదల కానుంది.