రాబోయే 10, 15 ఏళ్లలో ఇండియాను క్రీడల దేశంగా గుర్తిస్తారు : గావస్కర్‌‌‌‌‌‌‌‌

రాబోయే 10, 15 ఏళ్లలో ఇండియాను క్రీడల దేశంగా  గుర్తిస్తారు : గావస్కర్‌‌‌‌‌‌‌‌

ముంబై : రాబోయే 10, 15 ఏళ్లలో ఇండియా క్రీడల దేశంగా గుర్తింపు పొందుతుందని క్రికెట్ లెజెండ్‌‌‌‌‌‌‌‌ సునీల్‌‌‌‌‌‌‌‌ గావస్కర్‌‌‌‌‌‌‌‌ అన్నాడు. జావెలిన్ త్రోయర్‌‌‌‌‌‌‌‌ నీరజ్‌‌‌‌‌‌‌‌ చోప్రా, చెస్‌‌‌‌‌‌‌‌ సెన్సేషనల్‌‌‌‌‌‌‌‌ ప్రజ్ఞానంద, హెచ్‌‌‌‌‌‌‌‌. ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రణయ్‌‌‌‌‌‌‌‌ సంచలన పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌పై సన్నీ ప్రశంసలు కురిపించాడు. 

‘గతంలో కొన్ని ఆటలపైనే ఎక్కువగా ఫోకస్‌‌‌‌‌‌‌‌ ఉండేది. మీడియా కవరేజ్‌‌‌‌‌‌‌‌ కూడా వాటికే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతి క్రీడకు సరైన ఎక్స్‌‌‌‌‌‌‌‌పోజర్‌‌‌‌‌‌‌‌ లభిస్తున్నది. ప్రతి ఆటలో కొత్త స్టార్లు వస్తున్నారు. మీడియా కూడా ప్రతి క్రీడను కవరేజ్‌‌‌‌‌‌‌‌ చేసే స్థాయికి వెళ్లింది. ఒకప్పుడు అమెరికా, ఆస్ట్రేలియాను స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ కంట్రీగా పిలిచేవారు. కానీ మరో 15 ఏళ్లలో ఇండియాను కూడా క్రీడల దేశంగా గుర్తిస్తారు’ అని గావస్కర్‌‌‌‌‌‌‌‌  పేర్కొన్నాడు.