కాస్ట్లీ కారు కొన్న అభిషేక్ శర్మ.. ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

కాస్ట్లీ కారు కొన్న అభిషేక్ శర్మ.. ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

ఆసియా కప్ 2025 హీరో, టీమిండియా యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ కారు కొన్నాడు. కారు అంటే మాములు కారు కాదు వెరీ కాస్ట్లీ కారు. ఫెరారీ స్పోర్ట్స్ కారు కొనుగోలు చేశాడు అభిషేక్. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కొత్త కారు మూడు ఫొటోలను పోస్ట్ చేసి దానికి 'V12' అని క్యాప్షన్ ఇచ్చాడు.

ఇది చూసిన నెటిజన్లు అభిషేక్‎కు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాస్ట్లీ కారులో అభిషేక్ కాస్ట్లీ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఏమో అభిషేక్ కొన్న కారు వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ కారు ధర ఎంత..? మోడల్ ఏంటి..? కలర్ ఏంటి..? అనే విషయాలు ఆరా తీస్తున్నారు. అయితే.. అభిషేక్ కొన్న కారు ఫెరారీ V12  మోడల్. కారు కలర్ బ్లాక్. ఈ కారు ధర దాదాపు రూ.5.2 కోట్లు.

కాగా, 2025 ఆసియా కప్ విజేతగా టీమిండియా నిలిచిన విషయం తెలిసిందే. భారత్ ఆసియా కప్ గెలవడంలో ఓపెనర్ అభిషేక్ శర్మదే కీలక పాత్ర. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడి ఇండియాను విజేతగా నిలిపాడు. ఏడు ఇన్నింగ్స్‌లలో 44.86 సగటు, 200 స్ట్రైక్ రేట్‌తో 314 పరుగుల చేసి టోర్నీ టాప్ స్కోరర్‎గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ దక్కించుకున్నాడు. ఆసియా కప్‎లో అభిషేక్ బ్యాట్‎తో పరుగుల వరద పారించడంతో సెప్టెంబర్ మంత్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.