బాలయ్య బర్త్‌డే: విషెస్ చెప్పిన యువరాజ్‌సింగ్

బాలయ్య బర్త్‌డే: విషెస్ చెప్పిన యువరాజ్‌సింగ్

సినీ నటుడు, నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజు నేడు(జూన్ 10). ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా బాలయ్యకు విషెస్ తెలిపారు. 

"హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నందమూరి బాలకృష్ణ సార్.. ఇతర కార్యక్రమాలతో పాటుక్యాన్సర్ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా సమాజానికి అంకిత భావంతో మీరు చేస్తున్న సేవలు స్పూర్తిదాయకం. మీకు ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను..' అని యువరాజ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గతంలో బాలయ్యతో దిగిన ఫోటోను యువీ షేర్ చేశారు.

కాగా, బాలకృష్ణ అద్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కాన్సర్ పేషంట్లకు తక్కువ ఖర్చుకే అధునాతన చికిత్స అందిస్తున్న సంగతి విదితమే. బాధితులకు చక్కటి సంరక్షణ, పేదలకు అధునాతన క్యాన్సర్ చికిత్సలు, థెరపీలను అందించే ప్రపంచ స్థాయి సమగ్ర క్యాన్సర్ కేర్ సెంటర్‌ గా బసవతారకం హాస్పిటల్ పేరొందింది. ఇక 2011లో క్యాన్సర్ బారిన పడిన యువరాజ్.. ఆ తరువాత ట్రీట్మెంట్ తీసుకుని దాన్ని నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆనాటినుంచి ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి క్యాన్సర్ బాధితులకు సాయం చేస్తున్నారు. అదే సమయంలో యువీ బసవతారకం ఆసుపత్రికి సహాయం చేస్తున్నారు. ఇలా వీరిద్దరి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.