
మంత్రి కేటీఆర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల్ని మల్కాజ్ గిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
మల్కాజ్ గిరిలో నివసించే కార్తికేయ, లాలాపేట్ లో నివసించే ఫెడ్రిక్ స్నేహితులు. జల్సాలకు అలవాటు పడ్డ వీరిద్దరు. .ఈజీగా డబ్బు సంపాదించేందుకు మంత్రి కేటీఆర్ పేరును అస్త్రంగా ఉపయోగించుకున్నారు.
నిందితులు మంత్రి కేటీఆర్ పీఏలమంటూ పేర్లు మార్చి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో సిబ్బందిని బెదిరించి పనులు చేయించుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం శ్రీరాములనే వ్యక్తి తన కుమారుడికి వైద్యం కోసం డబ్బులు లేకపోవడంతో కార్తికేయని సంప్రదించాడు. కార్తికేయ తాను కేటీఆర్ కు పీఏగా పనిచేస్తున్నానని, శ్రీరాములు కుమారుడికి వైద్యం చేస్తే.. ప్రభుత్వం నుంచి రెండు లక్షలు ఇప్పిస్తామని ఓ హాస్పటల్ కి ఫోన్ చేసి నకిలీ డాక్యుమెంట్లను పంపించాడు.
కార్తికేయ మాటల్ని నమ్మిన హాస్పటల్ వైద్యులు శ్రీరామ్ కుమారుడికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తరువాత ఫేక్ డాక్యుమెంట్లని తేలడంతో బాదితుడు ఘట్కేసర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన ఘట్కేసర్ పోలీసులు, మల్కాజ్ గిరి ఎస్ఓటీ సహాయంతో ఇద్దరు నిందితులను అదుపులో తీసుకున్నారు.
గతంలో కూడా కార్తికేయ పై నల్గొండ 1టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ తరహా కేసులు నమోదైనట్లు డీసీపీ రక్షిత మూర్తి తెలిపారు. నిందితులు నుంచి 1 లక్ష 75వేలు నగదు , 3 మొబైల్ ఫోన్స్, ముఖ్యమంత్రి కార్యాలయం ఫేక్ డాక్యూమెంట్స్ని స్వాధీనం చేసుకుని నిందితుల్ని రిమాండ్ కి తరలిస్తునట్లు డీసీపీ రక్షిత మూర్తి. తెలిపారు