OTT Crime Thrillers: ఒకే రోజు ఓటీటీలోకి రెండు మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్.. ఎక్కడ చూడాలంటే?

OTT Crime Thrillers: ఒకే రోజు ఓటీటీలోకి రెండు మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్.. ఎక్కడ చూడాలంటే?

ప్రతి శుక్రవారం థియేట్రికల్‌‌ రిలీజ్‌‌తో పాటు ఓటీటీల్లో వచ్చే సినిమాలు, వెబ్‌‌ సిరీస్‌‌ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పదుల కొద్ది సినిమాలు, సిరీస్‌‌లు ప్రతి వారం స్ట్రీమింగ్‌‌కు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం (2025 నవంబర్ 28) రెండు డబ్బింగ్ సినిమాలు ఓటీటీల్లో చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఆ సినిమాలు క్రైమ్, ఇన్వెస్టిగేషన్ జానర్లో వస్తుండటంతో ఆడియన్స్కి ఫ్రెష్ థ్రిల్ ఇవ్వనున్నాయి. అందులో ఒకటి తమిళ థ్రిల్లర్ ఫిల్మ్ 'ఆర్యన్' కాగా మరొకటి మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ 'ది పెట్ డిటెక్టివ్'. ఈ రెండు సినిమాలు 

ఆర్యన్ ఓటీటీ:

విష్ణు విశాల్ హీరోగా కె ప్రవీణ్ రూపొందించిన చిత్రం ‘ఆర్యన్’. శుభ్ర, ఆర్యన్ రమేష్, విష్ణు విశాల్ కలిసి నిర్మించారు. నవంబర్ 7న తెలుగులో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు నవంబర్ 28 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 

‘రాట్ససన్’ విజయం తర్వాత విష్ణు విశాల్ మరోసారి పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. సైకో క్రిమినల్గా సెల్వరాఘవన్ పాత్ర ఇంటెన్స్ కలిగించే విధంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. సెల్వరాఘవన్ తనలోని మృగాన్ని చూపించేశాడు. మరణించిన వ్యక్తి వరుస హత్యలు ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందనే కోణాన్ని ఇందులో థ్రిల్లింగ్ గా చూపించారు. 

కథేంటంటే:

ఓ టీవీ ఛానల్ లైవ్‌లో పాల్గొంటాడు ఆత్రేయ (సెల్వ రాఘవన్). అక్కడ నయన(శ్రద్ధా శ్రీనాథ్) అతన్ని హోస్ట్ చేస్తుంది. సడెన్గా గన్‌తో అందరినీ బెదిరించి భయపెట్టేస్తాడు. ఈ క్రమంలో ఓ థ్రిల్లింగ్ కథ చెబుతానని చెబుతూ.. రాబోయే ఐదు రోజుల్లో ఐదు హత్యలు చేస్తానని.. ఎవరో చెప్పి మరీ చంపేస్తానని చెబుతాడు. ఇక ఆ వెంటనే తనను తాను షూట్ చేసుకుని ఛానల్ లైవ్‌లోనే మరణిస్తాడు.

ఆ తర్వాత ఆత్రేయ హెచ్చరించినట్లుగానే వరుసగా హత్యలు జరుగుతాయి. దాంతో పోలీసు డిపార్ట్ మెంట్కు పెద్ద సవాలుగా మారిన ఈ కేసుని.. ఉన్నత అధికారులు డీసీపీ నంది (విష్ణు విశాల్)కి అప్పజెబుతారు. అయితే, ఆత్రేయ చనిపోయిన తర్వాత.. వరుస హత్యలు చేస్తున్నదెవరు? అసలు ఇదెలా సాధ్యం? ఆత్రేయ ఎవరు? మరణించిన వ్యక్తి వీడియోలు పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లోకి ఎలా వస్తున్నాయి? చివరకు డీసీపీ నంది కేసు ఎలా పరిష్కరించాడనేది మిగతా స్టోరీ.

ది పెట్ డిటెక్టివ్ ఓటీటీ:

అనుపమ పరమేశ్వరన్ నటించిన రీసెంట్ మలయాళ కామెడీ థ్రిల్లర్ 'ది పెట్ డిటెక్టివ్'. షరాఫుద్దీన్, అనుపమ కీలక పాత్రల్లో నటించారు. ఈ కామెడీ థ్రిల్లర్ నవంబర్ 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఓ ప్రైవేట్ డిటెక్టివ్గా పనిచేశాడు హీరో. అతనికి ఎటువంటి కేసులు రాకపోయేసరికి.. తాను సొంతంగా తప్పిపోయిన ఓ పెంపుడు జంతువును వెతికడం స్టార్ట్ చేస్తాడు.

ఈ క్రమంలో కుక్కను వెతికే క్రమంలో ఎన్నో ట్విస్టులు బయటకి వస్తాయి. అంతేకాకుండా మాఫియా, క్రిమినల్స్ సైతం తన రీసెర్చ్ లో బయటపతారు. అసలు ఇదంతా ఎలా సాధ్యం అనే విషయాలు తెలియాలంటే ది పెట్ డిటెక్టివ్ చూడాల్సిందే.