అర్జెంటీనా వైస్ ప్రెసిడెంట్‌పై హత్యాయత్నం

అర్జెంటీనా వైస్ ప్రెసిడెంట్‌పై హత్యాయత్నం

అర్జెంటీనా వైస్ ప్రెసిడెంట్ క్రిస్టినా ఫెర్నాండెజ్  కిర్చ్నర్‌ తృటిలో తుపాకీ దాడి నుంచి తప్పించుకుంది. ఆమెపై కాల్పులు జరిపేందుకు ఓ దుండగుడు ప్రయత్నించగా.. సరిగ్గా గురిచూసి కాల్చే సమయంలో తుపాకీ జామ్ అయిపోయింది. దీంతో ఆమె ప్రాణాల నుంచి బయటపడింది. అవినీతి ఆరోపణల కేసులో విచారణ ఎదుర్కొంటున్న క్రిస్టినా.. తన ఇంటి ఎదుట చేరిన మద్దతుదారులకు అభివాదం చేస్తుండగా గుంపు మధ్యలోంచి ఓ వ్యక్తి హఠాత్తుగా తుపాకీ తీసి ఆమె తలకు గురిపెట్టాడు. తుపాకీ జామ్ కావడంతో ఆయన కాల్చలేకపోయాడు.

ఈ ఘటనపై అప్రమత్తమైన అర్జెంటీనా ప్రభుత్వం.. నిందితుడిని అరెస్ట్ చేసింది. దాడికి ప్రయత్నించిన వ్యక్తిని బ్రెజిల్ పౌరుడిగా గుర్తించారు. క్రిస్టినా 2007-2015 వరకు అర్జెంటీనా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె హయాంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కొందరు ఆందోళనకారులు నిరసనకు దిగారు. వారి మధ్యలో నుంచి వచ్చి కాల్చేందుకు ప్రయత్నించాడు నిందితుడు