విమర్శిస్తే సమస్యలు పరిష్కారం కావు: AITUC అధ్యక్షుడు వి.సీతారామయ్య

విమర్శిస్తే సమస్యలు పరిష్కారం కావు: AITUC అధ్యక్షుడు వి.సీతారామయ్య
  • సింగరేణిలో రాజకీయ జోక్యంపై పోరాడకుండా కొందరు  పైరవీలు 

గోదావరిఖని, వెలుగు :  సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీని విమర్శించడమే కొన్ని యూనియన్లు పనిగా పెట్టుకున్నాయని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్​వర్కర్స్​యూనియన్​స్టేట్​ప్రెసిడెంట్​వి.సీతారామయ్య మండిపడ్డారు. సింగరేణిలో పెరిగిన రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయకుండా కొందరు నేతలు పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు.

 సోమవారం గోదావరిఖనిలోని యూనియన్​ఆఫీస్​లో జరిగిన మీటింగ్​లో యూనియన్​జనరల్​సెక్రటరీ కె.రాజ్ కుమార్ తో కలిసి ఆయన మాట్లాడారు. ఏఐటీయూసీ గెలిచిన తర్వాత కార్మికుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో సంస్థయాజమాన్యం దృష్టికి తీసికెళ్లిందని గుర్తు చేశారు. స్ట్రక్చర్ మీటింగ్ లో మాట్లాడి పరిష్కరించిందని, అందులో కొన్నింటికి సర్క్యులర్ లు కూడా జారీ అయ్యాయని తెలిపారు. 

సంస్థకు వచ్చే లాభాల్లో 35 శాతం వాటా ఇవ్వాలని యాజమాన్యానికి లేఖ రాశామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపిందని చెప్పారు. సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటు, సొంతింటి స్కీమ్, మారుపేర్ల సమస్యల పరిష్కారం సర్కార్ పరిధిలోనే ఉందని  పేర్కొన్నారు. మీటింగ్​లో లీడర్లు మడ్డి ఎల్లాగౌడ్, కనకరాజు, సయ్యద్ సోహెల్, తాల్లపెల్లి మల్లయ్య, ప్రీతం, రామస్వామి, బుర్ర భాస్కర్, తొడుపునూరి రమేశ్ కుమార్ పాల్గొన్నారు.