వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని పంచలింగాల గ్రామంలోని ఓ రైతు వ్యవసాయ భూమిలో మొసలి కనిపించి కంగారు పెట్టింది. ఆదివారం ఉదయం మొసలిని చూసిన రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మొసలిని పట్టుకుని సంగారెడ్డి జిల్లా మంజీరా చెరువులో విడిచి పెట్టినట్టు మర్పల్లి అటవీ శాఖ సెక్షన్ అధికారి కిషన్‌నాయక్ తెలిపారు.
కాగా, పంచాలింగాల గ్రామానికి ఆనుకుని ఉండే నర్సాపూర్చెరువు నుంచి ఈ మొసలి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. దాదాపు మీటరన్నర పొడువున్న ఈ మొసలి సుమారు 100 కిలోల వరకు బరువు ఉందని అటవీశాఖాధికారులు చెప్పారు.
