సీఎం రిలీఫ్ ఫండ్స్ లో కోట్ల కుంభ‌కోణం 

సీఎం రిలీఫ్ ఫండ్స్ లో కోట్ల కుంభ‌కోణం 

హైద‌రాబాద్- క‌రోనా బాధితుల‌ను తెలంగాణ రాష్ట్రం ప‌ట్టించుకోవ‌డంలేద‌న్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. క‌రోనా మ‌న‌ల్ని ప‌ట్టిపీడియ‌బ‌ట్టి ఏడాది గ‌డుస్తున్నా.. రాష్ట్రంరులో స‌రైనా ప్ర‌ణాళిక లేద‌న్నారు కాంగ్రెస్ లీడ‌ర్ రేవంత్ రెడ్డి. గురువారం ఆయ‌న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..పోయిన ఏడాది క‌రోనా బాధితుల కోసం ఎంతో మంది వ్యాపార‌వేత్త‌లు, సినీ హీరోలు కోట్ల రూపాయ‌లు డొనేష‌న్ల రూపంలో ఇచ్చార‌ని..వాటిని కూడా మ‌న ప్ర‌భుత్వం స్వాహా అన‌డం సిగ్గు చేటు అన్నారు.  క‌రోనా కిట్ల కొనుగోళ్ల‌లో వందల కోట్లు గోల్ మాల్ జ‌రిగింద‌న్నారు. ప్ర‌భుత్వ నిధులు ప‌క్కదారి ప‌ట్టాయ‌ని.. ఈఎస్ఐ హాస్పిట‌ల్ కంటే ఎక్కువ కుంభ‌కోణం సీఎం రిలీఫ్ ఫండ్ లో జ‌రిగింద‌న్నారు.

ఫ‌స్ట్ వే, సెకండ్ వే .. అయిపోయినయ్.. ఇక థ‌ర్డ్ వే అంటున్న‌రు.. ఇంకా ఎంత మంది చ‌చ్చిపోయినా ప్ర‌భుత్వాలు స‌రైనా ప్ర‌ణాళిక చేయ‌లేవా అని ప్ర‌శ్నించారు. నిపుణులు,సైంటిస్టుల స‌ల‌హాలు మ‌న కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పాటించ‌డంలేద‌ని.. ఈ విష‌యంపై ప్ర‌ధాని మోడీకి లేఖ రాశాన‌న్నారు. క‌రోనా సాకుతో కొన్ని కార్పొరేట్ హాస్ప‌ట‌ల్స్ అడ్డ‌గోలుగా దోపిడీ చేస్తున్నాయిని ప్ర‌భుత్వం వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కార్పొరేట్ హాస్పిట‌ల్స్ 90 శాతం కేసీఆర్ బంధువుల‌వే అన్నారు. క‌రోనా క‌ష్ట కాలంలో ప్రైవేట్ హాస్పిట‌ల్స అడ్డ‌గోలుగా దోచుకుంటున్నా ప‌ట్టించుకోని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి మాన‌వ‌త్వంలేద‌ని స‌మాజం గ‌మ‌నిస్తుంద‌న్నారు. క‌రోనాను ఆరోగ్య‌శ్రీలో చేర్చ‌డంలేద‌ని తెలిపారు. క‌నీసం క‌రోనా ట్రీట్ మెంట్ లో జీఎస్టీ ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.