నకిలీ గోల్డ్‌‌తో మూడున్నర కోట్లు కొట్టేశారు

V6 Velugu Posted on Oct 01, 2020

ఫేక్​ అకౌంట్స్​తో గోల్డ్​ లోన్స్
యూబీఐ, తెలంగాణ
గ్రామీణ ​బ్యాంకుల్లో ఫ్రాడ్​..
ఐదుగురి అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌,వెలుగు : నకిలీ బంగారంతో రూ.3.46 కోట్ల లోన్లు తీసుకున్న ముఠా అరెస్టయ్యింది. వనస్థలిపురం ఇన్​చార్జి ఏసీపీ శంకర్‌‌‌‌‌‌‌‌ తెలిపిన ప్రకారం…  తుక్కుగూడకు చెందిన తలోజి సాయినాథ్(25) స్థానిక యూబీఐలో అప్రయిజర్​గా చేస్తున్నాడు. అతనితోపాటు బ్రాంచ్​ మేనేజర్‌‌‌‌‌‌‌‌ అంగోత్‌‌‌‌ సునీల్‌‌‌‌ కుమార్‌‌‌‌, అసిస్టెంట్‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ రమావత్‌‌‌‌ ప్రదీప్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ కలిసి ఫేక్​ అకౌంట్స్​ ఓపెన్​చేశారు. కర్మన్‌‌‌‌ఘాట్‌‌‌‌ భూపేశ్​గుప్తానగర్‌‌‌‌‌‌‌‌కి చెందిన గోల్డ్‌‌‌‌ స్మిత్‌‌‌‌ మునిగంటి సంతోశ్​కుమార్‌‌‌‌, తలోజి శివనాథ్(27)తో కలిసి 33 మంది పేర్లతో 96 అకౌంట్లు తీశారు. నకిలీ గోల్డ్‌‌‌‌ డిపాజిట్‌‌‌‌ చేసి రూ.2.91 కోట్ల లోన్లు  తీసుకున్నారు. ఏటా ఇంట్రెస్ట్‌‌‌‌ చెల్లించి రెన్యూవల్‌‌‌‌ చేస్తున్నారు.

ఇలా బయటపడింది

సునీల్‌‌‌‌కుమార్‌‌‌‌ జూన్‌‌‌‌లో బాన్సువాడకి ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు.  ఆయన స్థానంలో మేనేజర్‌‌‌‌‌‌‌‌గా వచ్చిన యశ్వంత్‌‌‌‌రెడ్డి ఈ​స్కామ్‌‌‌‌ గుర్తించాడు. ఈ నెల 23న పహాడీషరీఫ్‌‌‌‌ పోలీసులకు కంప్లయింట్ ​చేశాడు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు మంఖాల్ బ్రాంచ్​లో సాయినాథ్‌‌‌‌ గ్యాంగ్‌‌‌‌ మరో 25 మంది పేర నకిలీ గోల్డ్‌‌‌‌తో రూ.54.60 లక్షల లోన్స్‌‌‌‌ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Tagged Fake Gold, thives, crores

Latest Videos

Subscribe Now

More News