కొండగట్టులో భక్తుల రద్దీ...భారీ ట్రాఫిక్ జామ్‌‌‌‌‌‌‌

కొండగట్టులో భక్తుల రద్దీ...భారీ ట్రాఫిక్ జామ్‌‌‌‌‌‌‌
  • వై జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్‌‌‌‌‌‌‌

‌కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. సుమారు 20వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వాహనాలు ఎక్కువ సంఖ్యలో రావడంతో వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్‌‌‌‌‌‌‌‌ అయింది. 

ఆ సమయంలో ఆలయ సిబ్బంది, పోలీసులు లేకపోవడంతో సుమారు గంటపాటు ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు. స్థానిక సిబ్బంది పోలీసులు ఆలస్యంగా చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.