
మెదక్ టౌన్, వెలుగు: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ కెథడ్రల్చర్చిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. చర్చిలో ఉదయం శిలువ ఊరేగింపు నిర్వహించగా, మధ్యాహ్నం చర్చి ప్రెసిబిటరీ ఇన్‌చార్జి శాంతయ్య దైవ సందేశాన్ని అందించారు. అనంతరం చర్చి ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పిల్లల డ్యాన్సులు అందరిని అలరించాయి. కరోనా కారణంగా చర్చిలో భౌతిక దూరం పాటించేలా అవసరమైన ఏర్పాట్లను చేశారు.