
యాదాద్రి భువనగిరి జిల్లా : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది . ఈ రోజు(ఏప్రిల్ 14న) శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారిజామునుంచే క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. సాధారణంగానే యాదాద్రి ఆలయానికి భక్తుల తాకిడి ఉంటుంది. ఆందులోనూ శనివారం(second saturday), ఆదివారం సెలవుదినం కావడంతో భక్తుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఉచిత దర్శానానికి 4 గంటలు.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.