
సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(CRPF) స్మార్ట్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది. అత్యంత కీలక సమావేశాలు జరిగే ప్రాంతాలు, సున్నితమైన ప్రదేశాల్లో స్మార్ట్ ఫోన్లు వినియోగంపై నిషేధం విధిస్తూ CRPF ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు CRPF సిబ్బందితో పాటు జవాన్లకు వర్తిస్తాయని తెలిపింది. ఒక వేళ స్మార్ట్ ఫోన్‌ను ఆఫీసుకు తీసుకెళ్తే.. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో పెట్టాల్సి ఉంటుంది. సమాచార భద్రత దృష్ట్యానే స్మార్ట్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించామన్నారు. అధికంగా స్మార్ట్ ఫోన్లు వాడడంతో భద్రత ఉల్లంఘనకు దారి తీసే అవకాశం ఉందన్నారు. CRPF సమాచారాన్ని రహస్యంగా ఉంచేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కెమెరా లేని, రికార్డు చేయడానికి సాధ్య పడని మొబైల్స్ కు కొన్ని ప్రాంతాల్లో అనుమతించనున్నట్లు CRPF అధికారులు తెలిపారు.