వైరస్ ఎఫెక్ట్: సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయం మూసివేత

వైరస్ ఎఫెక్ట్: సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయం మూసివేత
  • స్టాఫ్​లో ఇద్దరికి కరోనా రావడంతో చర్యలు
  • ఇప్పటికే 135 మంది జవాన్లకు కరోనా

న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్​ సీనియర్ అధికారి అసిస్టెంట్​కు, బస్సు డ్రైవర్​కు కరోనా పాజిటివ్ రావడంతో ఢిల్లీలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్​) హెడ్ ఆఫీస్ ను మూసివేసినట్లు అధికారులు ఆదివారం మీడియాకు తెలిపారు. లోధి రోడ్ లో ఉన్న ఈ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ డైరెక్టర్ జనరల్(ఎస్‌డీజీ) ర్యాంక్ ఆఫీసర్ సెక్రటరీకి, సీఆర్పీఎఫ్ బస్సు డ్రైవర్ కు వైరస్‌ సోకినట్లు శనివారం తెలిసింది. దీంతో ఆదివారం నుంచి శానిటైజేషన్ పూర్తయ్యేంతవరకు ఆఫీస్ ను మూసివేస్తున్నట్లు తెలిపారు. స్పెషల్ డైరెక్టర్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారని, పాజిటివ్ వచ్చిన ఇద్దరితో కాంటాక్టు అయిన సిబ్బందిని, వారి కాంటాక్ట్స్ ను ట్రేస్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సీఆర్పీఎప్ 31 వ బెటాలియన్ లో 135 మంది జవాన్లకు కరోనా సోకింది.