చర్చల్లో పురోగతి.. తగ్గిన క్రూడాయిల్ రేట్లు

చర్చల్లో పురోగతి.. తగ్గిన క్రూడాయిల్ రేట్లు

పెట్రో ధరల పెరుగుదలతో సతమతమవుతున్న దేశాలకు కాస్త రిలీఫ్ దొరికింది. ఉక్రెయిన్ రష్యా మధ్య చర్చలు కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం క్రూడ్ ధరలపై ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దాదాపు 6శాతం వరకు తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర 106 డాలర్లకు తగ్గింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ క్రూడ్ కూడా 6 శాతం తగ్గి 99.6 డాలర్లకు చేరింది. ముడి చమురు ధరలు తగ్గుతుండటంతో పెట్రో భారం పెరిగి సతమతమవుతున్న దేశాలకు కాస్త ఊరట లభించింది. భారత్లోనూ ఆకాశాన్నంటుతున్న పెట్రో, డీజిల్ ధరలు తగ్గే అవకాశముంది. 

టర్కీలోని ఇస్తాంబుల్ లో ఉక్రెయిన్, రష్యా ప్రతినిధుల మధ్య మంగళవారం మూడో దఫా చర్చలు జరిగాయి. దాదాపు 3గంటల పాటు శాంతి చర్చలు కొనసాగాయి. చర్చలు నిర్మాణాత్మకంగా జరగడంతో కీవ్ తదితర నగరాల చుట్టూ నిలిపిన సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు రష్యా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యుద్ధభయంతో ఇప్పటి వరకు పెరుగుతూ వస్తున్న క్రూడాయిల్ ధరలకు కళ్లెం పడింది. 

మరిన్ని వార్తల కోసం..

సరిస్కా టైగర్ రిజర్వ్లో కార్చిచ్చు 

ప్రగతి భవన్ జనహితలో ఉగాది వేడుకలు