కొత్త ఎస్‌‌హెచ్‌‌ గ్రూపులు ఏర్పాటు చేయండి : సీఎస్ సోమేశ్ కుమార్

కొత్త ఎస్‌‌హెచ్‌‌ గ్రూపులు ఏర్పాటు చేయండి : సీఎస్ సోమేశ్ కుమార్

కొత్త ఎస్‌‌హెచ్‌‌ గ్రూపులు ఏర్పాటు చేయండి
అధికారులకు సీఎస్ సోమేశ్‌‌ కుమార్‌‌‌‌ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త సభ్యులతో స్వయం సహాయక బృందాలను (ఎస్‌‌హెచ్‌‌జీ) ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఎస్‌‌హెచ్‌‌జీల పనితీరుపై బీఆర్కే భవన్‌‌లో శుక్రవారం ఆయన రివ్యూ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 6,06,000 స్వయం సహాయక బృందాల్లో 64 లక్షల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు.

వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 4,30,785 బృందాలలో 46 లక్షల మంది, పట్టణ ప్రాంతాల్లో ఉన్న 1,76,623 బృందాలలో దాదాపు 18 లక్షల మంది సభ్యులున్నారని వెల్లడించారు. గ్రామాలు, పట్టణాల్లో గ్రూపుల్లో చేరని సభ్యులను గుర్తించి కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌‌హెచ్‌‌జీ గ్రూపులు, సభ్యుల వివరాలను పూర్తి స్థాయిలో అప్-డేట్ చేయాలని సూచించారు.