బీటెక్, ఎంఎస్సీ చేసిన వారికి గుడ్ న్యూస్.. CFTRIలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

బీటెక్, ఎంఎస్సీ చేసిన వారికి గుడ్ న్యూస్.. CFTRIలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

సీఎస్ఐఆర్ – సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్, మైసూరు  ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్–I.

మొత్తం ఖాళీలు: 12. 

విభాగాల వారీగా ఖాళీలు: మైక్రోబయాలజీ/ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ,  ఏఐ & ఎంఎల్​తో కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ/ పాలిమర్ సైన్స్, ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ లేదా ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో  ఎంఎస్సీ,   బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

వాక్​ఇన్ ఇంటర్వ్యూ: జూన్16, 17. 

సెలెక్షన్ ప్రాసెస్: వాక్​ఇన్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ cftri.res.inను సందర్శించండి.