ఐపీఎల్ 19లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీ చరిత్రలో ఐదుసార్లు టైటిల్ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్, త్రీ టైమ్స్ టైటిల్ విన్నర్ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఏప్రిల్ 14న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ రసవత్తర పోరు ప్రారంభం షురూ కానుంది. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్లుగా పేరున్న చెన్నై, కోల్‌కతా ఈ సీజన్‌ను అతి దారుణంగా ఆరంభించాయి. ఇరు జట్లు ఆడిన తొలి మ్యాడు మ్యాచుల్లో ఓటమి పాలయ్యాయి.
రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని సీఎస్‌కే నాలుగో మ్యాచ్‌లో ఎట్టకేలకు డీసీపై విజయం సాధించాయి టోర్నీలో బోణీ కొట్టింది. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు ఓడిపోగా.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవడంతో ఈ టోర్నీలో కేకేఆర్ ఇంకా విజయాల ఖాతా తెరవలేదు. దీంతో చెన్నైపై గెలిచైనా బోణీ కొట్టాలని కేకేఆర్ భావిస్తోంది. మరోవైపు గెలుపు జోష్‌లో ఉన్న సీఎస్కే సొంతగడ్డపై కేకేఆర్‌ను చిత్తు చేసి టోర్నీలో రెండో విజయం నమోదు చేయాలని చూస్తోంది.
ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్ రిపోర్ట్:
సాధారణంగా చెపాక్ స్టేడియం బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడి నెమ్మదైన పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయి. కానీ ఈ సీజన్లో చెపాక్ స్టేడియంలో పిచ్‌ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల జరిగిన మ్యాచులలో పిచ్ మంచి బౌన్స్, వేగాన్ని అందిస్తోంది. గతంలోని నెమ్మదైన పిచ్‌లకు భిన్నంగా పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా మారింది. దీంతో కేకేఆర్, సీఎస్కే మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండటంతో టాస్ గెలిచిన టీమ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని ఆ తర్వాత టార్గెట్ చేధించవచ్చు.
స్క్వాడ్‌లు:
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (సి), ఆయుష్ మాత్రే, ఎంఎస్ ధోని, సంజు శాంసన్, డెవాల్డ్ బ్రేవిస్, ఉర్విల్ పటేల్, శివమ్ దూబే, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ , అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, శ్రేయస్ గోపాల్, ముకేష్‌తన్ గోపాల్ హోసేన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, మాట్ హెన్రీ, రాహుల్ చాహర్, జాక్ ఫౌల్కేస్
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే , అంగ్క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణదీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్ , ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి, కామెరాన్ గ్రీన్, తేజ్ చక్రవర్తి, త్యాగి, ప్రశాంత్ సోలంకి, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్, బ్లెస్సింగ్ ముజారబానీ

