
ముంబైతో జరిగిన మ్యాచ్ లో చెన్నై గ్రాండ్ విక్టరీ సాధించింది. 140 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై 6 వికెట్ల తేడాతో గెలిచింది. 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 30, డేవన్ కాన్వే 44 పరుగులతో రాణించారు. అజింక్య రహానే 21, అంబటి రాయుడు 12, శివమ్ దూబె 26 పరుగులు చేయడంతో 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ఈ గెలుపుతో చెన్నై పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేస్ కు చేరింది. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా 2, ట్రిస్టన్ స్టబ్స్ , ఆకాష్ మాద్వాల్ చెరో వికెట్ తీశారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. ఒపెనర్ కామరాన్ గ్రీన్ 6 ,ఇషాన్ కిషన్ 7, రోహిత్ శర్మ డకౌట్ ఇలా 14 పరుగులకే ముంబై మూడు వికెట్లు కోల్పోయింది.
వరుస వికెట్లు పడుతున్న ముంబైని నేహల్ వాధేరా సూర్య కుమార్ యాదవ్ కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వాధేరా 64, సూర్యకుమార్ యాదవ్, 26, ట్రిస్టాన్ స్టబ్స్ 20 పరుగులు మినహా మిగతా ముంబై బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 8 వికెట్ల నష్టానికి 139 పరుగులే చేసింది. చెన్నై బౌలర్లలో మతీసా పతిరానా 3, దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే లు చెరో రెండు, రవీంధ్రా జడేజా ఒక వికెట్ తీశారు