CSK vs SRH: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్

CSK vs SRH: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్

 సన్ రైజర్స్  హైదరాబాద్ తో జరుగుతోన్న  మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది.  గత మ్యాచ్‌లో బెంగళూరుపై విక్టరీతో  జోరుమీదున్న చెన్నై మరో  విజయంపై కన్నేసింది.  ముంబయితో జరిగిన మ్యాచ్ లో ఓడిన సన్ రైజర్స్  ఈ మ్యాచ్‌లో గెలవాలని చూస్తోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది చెన్నై.  అలాగే ఐదు మ్యాచ్ లు ఆడి రెండు మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది సన్ రైజర్స్. 

సన్‌రైజర్స్ హైదరాబాద్

హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(సి), హెన్రిచ్ క్లాసెన్(w), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్

చెన్నై సూపర్ కింగ్స్

రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(w/c), మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సింగ్, మతీషా పతిరానా