చెత్త వేసేందుకు క్యూ కడుతున్నారు

చెత్త వేసేందుకు క్యూ కడుతున్నారు

కల్యాణ్ ఆఫీస్ కు బయల్దేరాడు. మెయిన్ రోడ్డుకువచ్చాక రెడ్ సిగ్నల్ పడింది. బండి ఆపాడు.సిగ్నల్ కు చాలా దూరంలో ఉన్నాడు. అప్పటికే ఐదునిమిషాలకు పైగా జాం అయిందనుకుంటా. రోడ్డుకు డివైడర్ లేదు. తెల్ల చార గీతలు మాత్రమే గీశారు.ఎదురుగా పెద్ద ట్రాఫికేమీ రావడం లేదు. వెంటనే బండిని అటుగా తిప్పాడు. గీతను దాటేసి ముందుకెళ్లాడు. ఆపై సిగ్నల్ పడీ పడకముందే దూసుకె ళ్లిపో యాడు. ఇలా మన రోడ్లపై ట్రాఫిక్ రూల్స్‌ కు బై.. బై.. చెప్పేబాపతులెందరో. కానీ, మన దేశంలో ఎక్కడా లేనివిధంగా ఓ నగరంలో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారు.చెత్త వేసే బండి వద్ద క్యూ కడుతున్నారు. రోడ్డుపై తెల్లచారలను లక్ష్మణ రేఖగా భావిస్తున్నారు. బండిని గీతదాటించడం లేదు. ఎంతో క్రమశిక్షణగా మెలుగుతూవెళ్తున్నారు. వాళ్లే మన ఈశాన్య రాష్ట్రం మిజోరాం రాజధాని ఐజ్వాల్ ప్రజలు. ఐజ్వాల్‌ లో ట్రాఫిక్ రూల్స్ను ప్రతి ఒక్కరూ పాటిస్తారు. కార్లు ఒక వరుసలో,బైక్స్ మరో వరుసలో ఆగుతాయి. సిగ్నల్ పడే వరకూఎవరూ వెళ్లరు. పాదచారులకు రోడ్డు దాటే సమయం ఇస్తారు. చెత్త బళ్ల వద్ద కూడా పెద్ద క్యూ ఉంటుంది.తమ వంతు కోసం ఎంతసేపైనా ఎదురు చూస్తారేతప్ప.. బండి చుట్టూ మూగరు. ఐజ్వాల్ జనం అండర్స్టాండింగ్ బావుంది కదూ. మనం కూడా ఎంచక్కాఇలా రూల్స్‌ను ఫాలో అయిపోతే అందరికీ సుఖం.