తెలుగులో హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది ఎస్తేర్ అనిల్

తెలుగులో హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది ఎస్తేర్ అనిల్

విక్రమ్ సహిదేవ్ లగడపాటి హీరోగా ‘దృశ్యం’ చిత్రంలో వెంకటేష్ కుమార్తెగా కనిపించిన ఎస్తేర్ అనిల్ హీరోయిన్‌‌గా ఓ చిత్రం తెరకెక్కుతోంది. వంశీ కృష్ణ మల్ల దర్శకత్వం వహిస్తున్నాడు. డైరెక్టర్ నక్కిన త్రినాథరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ, కథను అందించారు. బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. హీరో సందీప్ కిషన్ క్లాప్ కొట్టగా, నిర్మాత శరత్ మరార్ కెమెరా స్విచాన్ చేశారు. సుమంత్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశాడు. ఈ మూవీ లాంచ్ ఈవెంట్‌‌లో త్రినాథరావు మాట్లాడుతూ ‘నా బ్యానర్‌‌‌‌ నుంచి రాబోతున్న రెండో చిత్రమిది. త్వరలోనే టైటిల్‌‌ను ప్రకటిస్తాం. చాలా రోజుల తర్వాత  ఈ సినిమా కోసం కథ రాశా. ఇది కల్ట్ లవ్ స్టోరీ. టౌన్‌‌లో జరిగే అందమైన ప్రేమకథ.

ALSO READ : ఉగాది కానుకగా మహేష్ బాబు నెక్స్ట్ మూవీ

నాతో పాటు నరేష్ , ఉదయ్ భాగవతుల స్క్రీన్ ప్లేలో, నరేష్ , రాజేంద్ర ప్రసాద్ డైలాగ్స్‌‌లో పని చేశారు. ఇందులో విక్రమ్, ఎస్తేర్ జోడీ ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు. ఈ  నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని, అనకాపల్లి, హైదరాబాద్‌‌ పరిసరాల్లో షూట్ చేయనున్నట్టు దర్శకుడు వంశీకృష్ణ చెప్పాడు. మంచి స్ర్కిప్ట్‌‌లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని విక్రమ్, ఎస్తేర్ అన్నారు. ఈ చిత్రంలో  తారక్ పొన్నప్ప కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘ఈగల్’ ఫేమ్ దావ్‌‌జాంద్ సంగీతం అందిస్తున్నాడు.