ఇన్ హేలర్ తో కరోనా నయం!

ఇన్ హేలర్ తో కరోనా నయం!

సాధ్యమేనంటున్న ఇజ్రాయెల్ వైద్య నిపుణులు

ఇన్ హేలర్ తో కరోనాకు చెక్ పెట్టవచ్చంటున్నారు ఇజ్రాయెల్ డాక్టర్లు. ప్రొఫెసర్‌ నదిర్‌ అర్బేర్‌  ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఇన్‌హేలర్‌ అయిదు రోజుల్లో కరోనాను నయం చేస్తుందని తెలిపారు. మొదటి దశ ప్రయోగాలు పూర్తి చేసుకున్న ఈ ఇన్‌ హేలర్‌ తర్వాత ప్రయోగాలకు సిద్ధమౌతోందన్నారు. టెల్‌ అవీవ్‌లోని ఇజిలోవ్‌ మెడికల్‌ సెంటర్‌లో అభివృద్ధి చేసిన ఈ ఇన్‌హేలర్‌… ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయిలో ఉన్న కరోనా రోగులను చాలా తొందరగా నయం చేస్తోందని చెబుతున్నారు. 30 మంది కరోనా పేషెంట్లపై దీన్ని ప్రయోగించగా, అందరూ కోలుకున్నారన్నారు. వీరిలో 29 మంది అయిదు రోజుల్లోనే కోలుకున్నారని ప్రొఫెసర్‌ నాదిర్‌ అర్బేర్‌ తెలిపారు. ఇన్‌హేలర్‌ ద్వారా మందు నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి పనిచేయడం ప్రారంభిస్తుందన్నారు. అభివృద్ధి చేసిన CD24 అనే ప్రొటీన్‌ను నేరుగా ఊపరితిత్తుల్లోకి తీసుకెళుతుందన్నారు. వెళ్ళిన వెంటనే రోగ నిరోధక శక్తిని నియంత్రించడంలో ఈ ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. బయట నుంచి కరోనా వచ్చినా… దాన్ని అరికట్టి… రోగనిరోధక శక్తి తన పని తాను చేసుకుపోయేలా ప్రొటీన్‌ పనిచేస్తుందని ప్రొఫెసర్‌ నదీర్‌ అంటున్నారు. త్వరలోనే సంబంధిత అధికారుల అనుమతి కోసం దరఖాస్తు చేస్తామని తెలిపారు.