స్టార్​ సింబల్​ కరెన్సీ చెల్లుతుంది

స్టార్​ సింబల్​  కరెన్సీ చెల్లుతుంది

ముంబై: స్టార్​ సింబల్​తో  కూడిన  కరెన్సీ నోట్లు చెల్లుతాయని గురువారం రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా స్పష్టం చేసింది. అలాంటి కరెన్సీ నోట్లపై ఎలాంటి భయాలూ అవసరం లేదని పేర్కొంది. స్టార్​ సింబల్​ఉన్న కరెన్సీ నోట్లు చెల్లవంటూ సోషల్​ మీడియాలో వస్తున్న వదంతులపై ఆర్​బీఐ ఈ క్లారిఫికేషన్​ ఇచ్చింది. 

కొన్ని కరెన్సీ నోట్లపై సీరియల్​ నెంబర్​కు ముందు స్టార్​ సింబల్​ చోటు చేసుకుంటోందని, డిఫెక్టివ్​ నోట్లను రిప్లేస్​ చేసేందుకు ఈ సింబల్​ను చేర్చినట్లు వివరణ ఇచ్చింది. రిప్లేస్​మెంట్​ నోట్లను గుర్తించేందుకే ఆ స్టార్​ సింబల్​ వాడుతున్నట్లు పేర్కొంది. 

ALSO READ:సీతారామన్‌‌ను కలిసిన కుమార్‌‌‌‌ మంగళం బిర్లా