కరెంట్​ఎఫైర్స్​

కరెంట్​ఎఫైర్స్​

కరెంట్​ఎఫైర్స్​... నేషనల్ 
సామాజికాభివృద్ధి కమిషన్‌‌‌‌ అధ్యక్ష స్థానంలో భారత్‌‌‌‌ 
ఐక్యరాజ్యసమితిలో సామాజికాభివృద్ధి కమిషన్‌‌‌‌ 62వ సదస్సు అధ్యక్ష బాధ్యతలను భారత్‌‌‌‌  స్వీకరించింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న రుచిరా కాంభోజ్‌‌‌‌ ఆ బాధ్యతలను చేపట్టారు. 
ఉత్తరప్రదేశ్​ టూరిజం, అడ్వెంచర్ పాలసీ
ఉత్తరప్రదేశ్​ క్యాబినెట్ ఎడ్యుకేషన్ సర్వీస్ సెలక్షన్ కమిషన్, వాటర్ టూరిజం, అడ్వెంచర్ స్పోర్ట్స్ పాలసీకి  ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్ వాటర్ టూరిజం, అడ్వెంచర్ స్పోర్ట్స్ పాలసీ- 2023 రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన తేదీ నుంచి 10 సంవత్సరాల వరకు చెల్లుబాటులో ఉంటుందని తెలిపింది.
మిస్సింగ్‌‌‌‌లో మధ్యప్రదేశ్‌‌‌‌ టాప్‌‌‌‌
దేశంలో 2019–21 లో13.13 లక్షల మంది బాలికలు, మహిళలు కనిపించట్లేదని నేషనల్‌‌‌‌ క్రైం రికార్డ్స్‌‌‌‌ బ్యూరో(ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌బీ) వెల్లడించింది. మిస్సింగ్​ లో మధ్యప్రదేశ్‌‌‌‌ టాప్​లో నిలిచింది. 
 సినిమాటోగ్రఫీ(చట్ట సవరణ) బిల్లు
సినిమాటోగ్రఫీ చట్టం–1952కు సవరణలు చేస్తూ.. తాజాగా సినిమాటోగ్రఫీ(చట్ట సవరణ) బిల్లు–2023ను కేంద్రం తీసుకొచ్చింది. దీంతో పైరసీ చేసిన సినిమాలు ఇంటర్నెట్‌‌‌‌లో కనిపించవు.  
జనన, మరణ సవరణ బిల్లుకు ఆమోదం
జనన, మరణ నమోదు (సవరణ) బిల్లు - 2023ను లోక్‌‌‌‌సభ ఆమోదించింది. దీంతో విద్యా సంస్థల్లో ప్రవేశానికి, డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ జారీకి, ఓటరు జాబితా తయారీకి, ఆధార్‌‌‌‌ నంబరు పొందడానికి, వివాహాన్ని నమోదు చేయించుకోవడానికి, ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి ఒక్క జనన ధ్రువీకరణ పత్రం ఉంటే సరిపోతుంది.
వ్యక్తులు
మహేంద్రదేవ్‌‌‌‌ 
ఎకనమిక్‌‌‌‌ అండ్‌‌‌‌ పొలిటికల్‌‌‌‌ వీక్లీ (ఈపీడబ్ల్యూ) సంపాదకుడిగా తెలుగు వ్యక్తి ప్రొఫెసర్‌‌‌‌ మహేంద్రదేవ్‌‌‌‌ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌‌‌‌కు చెందిన ప్రొఫెసర్‌‌‌‌ దేవ్‌‌‌‌ ఢిల్లీ స్కూల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఎకనమిక్స్‌‌‌‌లో పీహెచ్‌‌‌‌డీ, అమెరికాలోని యేల్‌‌‌‌ విశ్వవిద్యాలయంలో పోస్ట్‌‌‌‌ డాక్టోరల్‌‌‌‌ పరిశోధన చేశారు.
జొన్నలగడ్డ రాజేంద్ర
జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌‌‌‌ (ఎన్‌‌‌‌సీడీఆర్‌‌‌‌సీ) సభ్యుడిగా రిటైర్డ్‌‌‌‌ ఎయిర్‌‌‌‌ వైస్‌‌‌‌మార్షల్‌‌‌‌ జొన్నలగడ్డ రాజేంద్ర నియమితులయ్యారు.  
చేతనా మారూ
ప్రతిష్టాత్మక బుకర్‌‌‌‌ ప్రైజ్‌‌‌‌ పురస్కారానికి  ఈ ఏడాది విజేత ఎంపిక పరిశీలనలో భారతీయ మూలాలున్న రచయిత్రి ‘చేతనా మారూ’ చోటు దక్కించుకున్నారు. ప్రాథమిక పరిశీలన కోసం కమిటీ ఎంపిక చేసిన 13 పుస్తకాలలో చేతనా మారూ తొలి నవల ‘వెస్ట్రన్‌‌‌‌ లేన్‌‌‌‌’ ఉంది. 
జాస్తి కృష్ణకిశోర్‌‌‌‌
సీనియర్‌‌‌‌ ఐఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌‌‌‌కు ఆదాయపు పన్ను విభాగం చీఫ్‌‌‌‌ కమిషనర్‌‌‌‌గా పదోన్నతి లభించింది. ఆయన ప్రస్తుతం ఒడిశాలో ఆదాయపన్ను విభాగం దర్యాప్తు విభాగం ప్రిన్సిపల్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌గా ఉన్నారు. 
జావెద్‌‌‌‌ అఖ్తర్‌‌‌‌
‘శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు’ ఆధ్వర్యంలో సినారె 92వ జయంత్యుత్సవాన్ని రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఉర్దూ, హిందీ కవి, పద్మభూషణ్‌‌‌‌ జావెద్‌‌‌‌ అఖ్తర్‌‌‌‌ను ‘విశ్వంభర డా।। సి.నారాయణరెడ్డి జాతీయ సాహితీ పురస్కారం’తో సత్కరించారు. 
తెలంగాణ 
ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం
టీఎస్‌‌‌‌ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం అమలులోకి వస్తే ఆర్టీసీలో పనిచేస్తున్న మొత్తం 43,373 మంది ఉద్యోగులు సర్కారీ ఉద్యోగులుగా మారతారు. 
ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్‌‌‌‌
ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్‌‌‌‌ ను 2023 జూన్​ 14 న మంజూరైనట్లు కేంద్రం ప్రకటించింది.
సైన్స్ అండ్ టెక్నాలజి 
పీఎస్‌‌‌‌ఎల్‌‌‌‌వీ-సి56 ప్రయోగం సక్సెస్​ 
ఇస్రో షార్​ నుంచి చేపట్టిన  పీఎస్‌‌‌‌ఎల్‌‌‌‌వీ-సి56 రాకెట్‌‌‌‌ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌‌‌‌ఎల్‌‌‌‌వీ వాహకనౌక 420 కిలోల బరువున్న ఉపగ్రహాలతో దూసుకెళ్లింది. తాజా ప్రయోగంతో ఇస్రో పంపిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 431కి చేరింది.
ఇంటర్నేషనల్ 
సింగపూర్‌‌‌‌లో తొలిసారి మహిళకు ఉరిశిక్ష
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఓ మహిళను సింగపూర్‌‌‌‌ ప్రభుత్వం ఉరి తీసింది. మహిళకు ఉరిశిక్ష అమలు చేయడం 20 ఏళ్లలో తొలిసారి.  సారిదేవి దామని హెరాయిన్‌‌‌‌ను రవాణా చేసిన కేసులో దోషిగా తేలడంతో 2018లో ఆమెకు ఉరి శిక్ష విధించారు.
అమెరికా రక్షణ పరికరాల్లో చైనా మాల్‌‌‌‌వేర్‌‌‌‌
ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యం, ఆయుధాలు, కమ్యూనికేషన్‌‌‌‌ వ్యవస్థ ఉన్న అమెరికాను చైనా మాల్‌‌‌‌వేర్‌‌‌‌ భయపెడుతోంది. తమ రక్షణ వ్యవస్థపై చైనా హ్యాకర్లు కన్నేశారని, రక్షణ శాఖ పరికరాల్లోకి ఓ కంప్యూటర్‌‌‌‌ కోడ్‌‌‌‌ను(మాల్‌‌‌‌వేర్‌‌‌‌) ప్రవేశపెట్టారని అమెరికా భావిస్తోంది.
నైగర్‌‌‌‌లో సైన్యం తిరుగుబాటు 
పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్‌‌‌‌లో అధ్యక్షుడు మహ్మద్‌‌‌‌ బజౌమ్‌‌‌‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లు సైన్యం ప్రకటించింది. ఇప్పటికే అధ్యక్షుడి నివాసంతో పాటు ఆయన కుటుంబాన్ని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని పడగొట్టినట్లు సైన్యం ప్రకటించింది.