పోటీ పరీక్షల్లో విజయం.. కరెంట్ అఫైర్స్ కీలకం

పోటీ పరీక్షల్లో విజయం.. కరెంట్ అఫైర్స్ కీలకం

అంతర్జాతీయ సంబంధాలు 

పోటీ పరీక్షల్లో అంతర్జాతీయ సంబంధాలనేవి కరెంట్​ అఫైర్స్​ కిందికి వస్తాయి. కాని ఇదీ ఒక సబ్జెక్టే. అంతర్జాతీయ సంబంధాలు అనేది పొలిటికల్​ సైన్స్​లో భాగం. కాకపోతే ఇక్కడ అంతర్జాతీయ సంబంధాలను సబ్జెక్టుగా చదవాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ సంబంధాల్లో ఒక ముఖ్యమైన చాప్టర్​ ఏమిటంటే పొరుగు దేశాలతో భారతదేశ సంబంధాలు. ఉదాహరణకు పాకిస్తాన్​, శ్రీలంక, చైనా, మయన్మార్​, నేపాల్​, భూటాన్​, మాల్దీవులు, బంగ్లాదేశ్. మరో ముఖ్యమైన చాప్టర్​ ఏమిటంటే అభివృద్ధి చెందిన దేశాలతో భారతదేశ సంబంధాలు. అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి ఒక ప్రమాణికమైన పుస్తకంతో పాటు స్టాండర్డ్​ తెలుగు పేపర్లు చదవాలి. వాస్తవంగా చాలా తెలుగు పేపర్లు అంతర్జాతీయ వార్తలను ప్రచురించవు. కాబట్టి ఏ తెలుగు పేపర్లలో అంతర్జాతీయ సంబంధాలు ఎక్కువగా రాస్తారో ఆ పేపర్లు మాత్రమే చదవాలి. లేకపోతే మార్కులను కోల్పోవాల్సి వస్తుంది. 

అంతర్జాతీయ కరెంట్​ అఫైర్స్​ను కూడా ముఖ్యంగా రెండు విభాగాలుగా విభజించుకోవచ్చు. సబ్జెక్టును సమకాలిన అంశాలతో అనుసంధానం చేసి చదవడం చాలా తక్కువ. ఎందుకంటే సబ్జెక్టుతో అనుసంధానం ఉండేవి పోటీ పరీక్షల్లో ఎక్కువగా లేవు. పూర్తిగా సమకాలీన అంశాలతో కూడుకున్నవి చాలా అంశాలు ఉంటాయి. పూర్తిగా సమకాలీన అంశాలతో కూడుకున్నవి ఫిపా వరల్డ్​ కప్​. ఫుట్​బాల్​కు సంబంధించింది కాబట్టి స్పోర్ట్స్​ టాపిక్​ కిందికి వస్తుంది. నోబెల్​ ఫ్రైజెస్​కు సంబంధించింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం అక్టోబర్​ నుంచి డిసెంబర్​ వరకు వార్తల్లో ఉండే అంశం.  వివిధ దేశాలకు కొత్తగా వచ్చిన ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, వివాదాస్పదమైన వ్యక్తులు మొదలైనవి.  అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో వచ్చే వివిధ సంస్థల బ్యాక్​గ్రౌండ్​ కూడా చదువుకోవాలి. 

పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కరెంట్​ అఫైర్స్​లో పట్టు సాధించడం కీలకం.  సబ్జెక్టు అంశాలతో పోలిస్తే పరిధి, విస్తృతి చాలా ఎక్కువే. కానీ ఇందులో సాధించే మార్కులే తుది ఫలితాన్ని నిర్ణయిస్తాయనడంలో సందేహం లేదు. ఇటీవల జరిగిన గ్రూప్​–1 ప్రిలిమినరీ కరెంట్​ అఫైర్స్​ ప్రిపరేషన్​లో మార్పులు చేసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా కరెంట్​ అఫైర్స్​ను ఎలా ప్రిపేర్​ కావాలో తెలుసుకుందాం. ఏ పోటీ పరీక్షలోనైనా కరెంట్​ అఫైర్స్​ మీద రెండు అంశాలు ఉంటాయి. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు, అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు. సిలబస్​ ప్రకారం ప్రాంతీయ కరెంట్​ అఫైర్స్ అనే పేరు ఉంటుంది. దీనిని పూర్తిగా అర్థం చేసుకుంటే కనీసం మూడు నుంచి ఏడు ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది. అయితే, గ్రూప్​–1 ప్రిలిమినరీ పరీక్ష తర్వాత కొన్ని విషయాలు మనకు స్పష్టంగా అర్థం అవుతున్నాయి. సాధారణంగా అందరు అనుకుంటున్నట్లు ఆరు నెలల కరెంట్​ అఫైర్స్​ అనేది సరికాదు. ఏడాదిన్నర క్రితం అంశాలు కూడా పరీక్షల్లో వచ్చాయి. 

రెండు విభాగాలుగా విభజించాలి

1. పూర్తిగా సమకాలీన అంశాలతో కూడుకున్నది.

సమకాలిన అంశాలతో కూడిన కరెంట్​ అఫైర్స్​ ఈ అంశం కిందికి వచ్చే ఉదాహరణకు కొన్ని టాపిక్స్​ పరిశీలిస్తే..  తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడా వ్యక్తులు సాధించిన విజయాలు, రాష్ట్రానికి చెందిన వ్యక్తులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత స్థానంలో ఉంటే వాటిని చదువుకోవాలి.  రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకుంటే ఉదాహరణకు పద్మశ్రీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, దాదా సాహేబ్​ ఫాల్కే అవార్డులపై ఫోకస్​ చేయాలి. 

2. సబ్జెక్టు అంశాన్ని సమకాలీన అంశాలతో అనుసంధానం చేసి చదవాలి.

ఈ అంశం కిందికి వచ్చేవి ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రవేశపెడుతున్న పథకాలు. వాస్తవంగా ఈ అంశం స్కీమ్​ లేదా పథకాల కిందికి వస్తుంది. అన్ని ప్రభుత్వ పథకాలు చదవకుండా గత రెండు సంవత్సరాల కాలంలో ప్రవేశపెట్టిన పథకాల మీద ఫోకస్​ చేయాలి.  రవాణాకు సంబంధించిన అంశం. రవాణ​ అంటే రోడ్డు, రైల్వే మొదలైనవి. రాష్ట్ర స్థాయిలో ముఖ్యంగా రోడ్డు రవాణా. హైదరాబాద్​ రీజనల్​ రింగ్​ రోడ్డు, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన జాతీయ హైవేలు దీని కిందికి వస్తాయి. 

నేషనల్​ కరెంట్​ అఫైర్స్​ 

పరీక్షా సమయాన్ని అనుసరించి దీని మీద వచ్చే ప్రశ్నలు మారుతూ ఉంటాయి. సాధారణంగా అయితే మూడు నుంచి 8 ప్రశ్నల వరకు రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే, ఇవి కూడా ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు.సమకాలిన అంశాలతో కూడిన జాతీయ కరెంట్​ అఫైర్స్​లో భాగంగా ముఖ్యమైన తేదీలు, పుస్తకాలు, రచయితలు. ఇక్కడ ముఖ్యమైన తేదీలు అంటే అన్ని తేదీలను చదవడం కాదు, కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ప్రకటించిన ముఖ్యమైన తేదీలు. ఇక్కడ పుస్తకాలు, రచయితలు అంటే వివాదాస్పదమైన పుస్తకాలు, జ్ఞానపీఠ్​ అవార్డు అందుకున్నవి. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధాన మంత్రులు రాసినవి. సబ్జెక్టు అంశాన్ని సమకాలీన అంశంతో ముడిపడి ఉన్న జాతీయ కరెంట్​ అఫైర్స్ ఉదాహరణకు ఈ మధ్య కాలంలో వార్తల్లో వచ్చిన అంశాల్లో తడి భూముల. కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​లో భాగంగా 75 వరకు తడి భూములను గుర్తించింది. అంటే ఈ అంశం పర్యావరణ సబ్జెక్టు కిందికి వస్తుంది. 

ఇవి గమనించండి

గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షల్లో వచ్చిన కరెంట్​ అఫైర్స్​ నుంచి మనం గమనించాల్సిన అంశాలు. కరెంట్​ అఫైర్స్​కు సంబంధించి వివిధ తెలుగు దినపత్రికలను చదవాలి. రెండు లేదా అంతకంటే ఎక్కువ వార్తా పత్రికలను తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది.  ఆరు నెలల కరెంట్​ అఫైర్స్​ చదివితే చాలు అనే అభిప్రాయం తప్పు అనిఈఈ రుజువు అయింది. టాపిక్​ ప్రాధాన్యతను అనుసరించి 18 నెలల వరకు కరెంట్​ అఫైర్స్​ చదవాలని తేలింది.  కరెంట్​ అఫైర్స్​లో వచ్చిన అంశాలనుబట్టి వెయిటేజీ ఉంటుంది. కాని స్టాటిక్​ పద్ధతిలో ఉండదని తెలిసింది. కరెంట్​ అఫైర్స్​ సొంత నోట్స్​ తయారు చేసుకోవాలి. లేకపోతే రివిజన్​ చేసేటప్పుడు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.  కరెంట్​ అఫైర్స్​లో అర్థం కాని కొన్ని అంశాలను స్టాండర్డ్​ పుస్తకంలో తప్పరిసరిగా బేసిక్స్​ నేర్చుకోవాలి.  ఏ టాపిక్​ నుంచి ప్రశ్న వస్తుందో ముందే ఊహించ గలిగే స్థాయిలో మన ప్రిపరేషన్​ ఉండాలి. ప్రామాణికమైన పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం ఏమిటంటే ప్రశ్నకు కచ్చితమైన సమాధానాన్ని గుర్తించగలుగుతారు. పాత కరెంట్​ అఫైర్స్​ ప్రశ్నపత్రాలను విశ్లేషణ చేయగలగాలి. లేకపోతే ఎక్కువగా సమయం వెచ్చించాల్సి ఉంటుంది.