హాస్పిటాలిటీకి ఫుల్​ డిమాండ్​

హాస్పిటాలిటీకి ఫుల్​ డిమాండ్​

ఆతిథ్య రంగంపై ఆసక్తి ఉన్నవారు దేశంలోని ప్రముఖ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఐహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం) సంస్థల్లో చదవడానికి  నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఏ).. నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ -జాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంట్రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం - జేఈఈ) 2023 నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. ప్రస్తుతం ఆతిథ్య రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. కోర్సులు పూర్తి చేసుకుంటే స్వయం ఉపాధితో పాటు సులువుగా ఉద్యోగం సాధించవచ్చు. ఈ నేపథ్యంలో ఎగ్జామ్​ ప్యాటర్న్​, ప్రిపరేషన్​ ప్లాన్​, హయ్యర్​ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం.. 

నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాటరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీటీ) బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్సును ఐహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంల్లో అందిస్తోంది. వీరికి డిగ్రీలను జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ, న్యూఢిల్లీ అందజేస్తోంది. ఈ  కోర్సులో అడ్మిషన్స్​కు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం- జేఈఈ రాయాలి. ఈ స్కోరుతో మొత్తం 75 సంస్థల్లో అవకాశం లభిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని సంస్థల్లోనూ మొత్తం 11965 సీట్లు ఉన్నాయి. ఐహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 285, వైఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిథమ్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 120, తిరుపతి, మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంలు ఒక్కో దానిలో 60 సీట్లు ఉన్నాయి. ఈ స్కోరుతో ఇతర ప్రైవేట్​  సంస్థల్లోనూ చేరవచ్చు. 

తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం ఆధ్వర్యంలోని ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఐహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం) హైదరాబాద్, రాష్ట్రీయ సంస్థలైన డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూరిజం అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్, స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరుపతి, తెలంగాణ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంగారెడ్డి.. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం - జేఈఈతో ప్రవేశం కల్పిస్తున్నాయి. 

ఎంట్రన్స్​ ఎగ్జామ్​ 

ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలుంటాయి. ఇందులో న్యూమరికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎబిలిటీ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనలిటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆప్టిట్యూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30, జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అఫైర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30, ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 60, రీజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30, సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆప్టిట్యూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 50 ప్రశ్నలు వస్తాయి. పరీక్షకు మూడు గంటల సమయం ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ మీడియాల్లో ఉంటుంది.

కోర్సులు :  బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్సు వ్యవధి మూడేళ్లు. మొత్తం 6 సెమిస్టర్లు. ఇందులో భాగంగా ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్, ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేవరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీస్, అకామడేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్, ఫ్రంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్, అకౌంటింగ్, హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్, న్యూట్రిషన్, ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్, కంప్యూటర్స్, ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిటీ, ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, కమ్యూనికేషన్, ఫెసిలిటీ ప్లానింగ్, స్ట్రాటజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంశాల్లో అధ్యయనం చేస్తారు. కోర్సు చివరలో ప్రాజెక్టు వర్కు పూర్తిచేయాలి. ఇందుకోసం విద్యా సంస్థలు ఏదైనా హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా క్యాటరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థతో ఒప్పందం చేసుకొని ట్రైనింగ్​ అందిస్తాయి.

హయ్యర్​ ఎడ్యుకేషన్ ​: బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత  ఎమ్మెస్సీ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్సు చేసుకోవచ్చు. కొన్ని ఐహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంలు పీజీ కోర్సులు అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేసుకున్నవారు  టీచింగ్​తో పాటు ఆతిథ్య రంగంలో ఉన్నత స్థాయి హోదాలతో అవకాశం పొందవచ్చు. బీఎస్సీ అనంతరం పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరవచ్చు. వీటిని ఏడాది/ ఏడాదిన్నర వ్యవధితో పలు సంస్థలు అందిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోటళ్లలోనూ ఈ కోర్సులు పూర్తిచేసుకుని అక్కడే ఉపాధి పొందవచ్చు. ఐటీసీ, వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూపులు వీటిని ప్రత్యేకంగా అందిస్తున్నాయి. కోర్సు పూర్తయిన వెంటనే ఆ సంస్థల్లో మంచి హోదా, వేతనంతో ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. 

టాప్​ స్కోర్​ సాధించాలంటే.. 

కేంద్ర ఆధ్వర్యంలో నడిచే ఐహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంల్లో అడ్మిషన్స్​కు పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇందులో సీటు సాధించాలంటే టాప్​ స్కోర్​ సాధించాలి. ఇందుకోసం  న్యూమరికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎబిలిటీ, ఎనలిటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆప్టిట్యూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలోని ప్రశ్నలకు 9, 10 తరగతుల మ్యాథ్స్​ బుక్స్​ చదవాలి. వయసు, పని-వేతనం, చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్, సమయం-పని విభాగాల్లో ప్రశ్నలు వస్తున్నాయి. గుణింతాలు, కూడికలు, తీసివేతలు, భాగహారం, కసాగు, గసాభా, సగటు, నిష్పత్తి, భిన్నాలు మొదలైనవాటిలో బేసిక్స్​ మీద అవగాహన ఉండాలి. ప్రతి టాపిక్​ మీద ప్రాక్టీస్​ బిట్స్​ సాధన చేయాలి. 

* రీజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలోని బ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలేషన్లు, సిరీస్, స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అజంప్షన్స్, వెర్బల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంశాలపై ఎక్కువ ఫోకస్​ చేయాలి. 

* జీకే, కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అఫైర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలో ఎక్కువ ప్రశ్నలు జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీకే) నుంచే వస్తున్నాయి. హిస్టరీ, పాలిటీ, జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్​లో బేసిక్స్​ అంశాల మీద ప్రశ్నలు అడుగుతారు. ఇందుకోసం 8,9,10 తరగతుల సైన్స్, సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుస్తకాల్లోని ముఖ్యాంశాలు ప్రాక్టీస్​ చేయాలి.  రాజధానులు, కరెన్సీ, పార్లమెంట్లు, క్రీడలు-– విజేతలు, అవార్డులు, పుస్తకాలు– -రచయితలు..వీటిని ప్రాధాన్యంతో చదివితే ఎక్కువ మార్కులు పొందవచ్చు.  

* ఇంగ్లీష్ సబ్జెక్టు నుంచి ప్రాథమిక స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. ఆంటోనిమ్స్​, సినోనిమ్స్, కంజక్షన్లు, ప్రిపొజిషన్లు, పాసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలైన విభాగాల నుంచి వీటిని అడుగుతారు. 9, 10 తరగతుల్లోని గ్రామర్​ బాగా అధ్యయనం చేయాలి.  

* సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆప్టిట్యూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలోని ప్రశ్నలు ఆతిథ్య, సేవా రంగాలకు చెందినవిగా ఉంటాయి. ప్రశ్నను బాగా చదివి, ఆలోచించి, విచక్షణతో సమాదానం గుర్తించవచ్చు. ఆతిథ్య పరిశ్రమ, సేవారంగంపై అవగాహన పెంచుకుంటే ఎక్కువ మార్కులు సొంతం చేసుకోవచ్చు. ప్రీవియస్​, మోడల్​ పేపర్స్​ ప్రాక్టీస్​ చేస్తే తప్పులు సరిచేసుకొని ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. 

ఉద్యోగ అవకాశాలు

ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి స్పెషలైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బట్టి కిచెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, ఫ్లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిచెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్, వివిధ సేవా పరిశ్రమల్లో గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్, హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, ఫాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఎగ్జిక్యూటివ్, క్యాటరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థలు, షిప్పుల్లో సప్లై, కిచెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాలు; పర్యాటక సంస్థలు, కేంద్రాల్లో వివిధ రకాల సేవలు, మల్టీ నేషనల్​ కంపెనీల క్యాంటీన్లు, హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహణ, హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కళాశాలల్లో ఫ్యాకల్టీ, సొంతంగా ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించడం...తదితర అవకాశాలు దక్కుతాయి. 

పార్క్, స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వుడ్, మారియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లీలా, ఒబేరాయ్, తాజ్ లాంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు. ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థలైన కేఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ, మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డొనాల్డ్స్, పీజాహట్, డామినోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..మొదలైనవి క్యాంపస్​ ప్లేస్​మెంట్స్ ద్వారా తీసుకుంటున్నాయి. ఆర్మీలో జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాలకు ఈ కోర్సు పూర్తి చేసినవారు అప్లై చేసుకోవచ్చు.

నోటిఫికేషన్​ 

అర్హత : ఇంటర్​లో ఉత్తీర్ణత సాధించాలి. ప్రస్తుతం సెకండ్​ ఇయర్ చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ వయసువారైనా ఈ పరీక్ష రాసుకోవచ్చు. గరిష్ట వయసు నిబంధన తొలగించారు.

అప్లికేషన్స్​ : అర్హులైన​ అభ్యర్థులు ఆన్​లైన్​లో ఏప్రిల్​ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.450. ఈడబ్ల్యుఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.700. జనరల్, ఓబీసీ, ఓబీసీ-ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. వీరందరికీ రూ.1000 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. మే 14న పరీక్ష నిర్వహిస్తారు. 

ఎగ్జామ్​ సెంటర్స్ : తెలంగాణలో  హైదరాబాద్, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు  https://nchmjee.nta.nic.in/ వెబ్​సైట్​లో సంప్రదించాలి. 

 వెలుగు ఎడ్యుకేషన్​ డెస్క్​