Good Health: కరివేపాకుతో ఆరోగ్యం అద్భుతమైన ప్రయోజనాలు

Good Health: కరివేపాకుతో ఆరోగ్యం అద్భుతమైన ప్రయోజనాలు

ప్రతి భారతీయ వంటకాల్లో కరివేపు కామన్‌గా కనిపిస్తుంది. చాలామంది దీన్ని కేవలం రుచి కోసమే వేస్తారని అనుకుంటారు. పక్కకు తీసి పడేస్తుంటారు. రోజూ పొద్దున్నే  కరివేపాకు తింటే   కలిగే ఈ ప్రయోజనాలు గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. కరివేపాకు తాజా సువాసన, కమ్మని రుచిని అందిస్తుంది. అందుకే, మన ఇళ్లల్లో కరివేపాకు లేనిదే వంట పూర్తికాదు. మన పూర్వికులు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం ఈ కరివేపాకే. ఫాస్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కరివేపాకును పట్టించుకొనేవాళ్లు తక్కువైపోయారు. మరి, కరివేపాకు ప్రత్యేకతలు, అందులోని ఔషదగుణాలు ఏమిటో తెలుసుకుందాం...

కరివేపాకు మనందరికి తెలిసిందే. దీని వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్నింగ్ చేసే బ్రేక్‌ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్‌లో తీసుకునే వంటకాల్లో ఇది ఉండటం కామన్. కానీ రోజు వారి వంటకాల్లో ఉండే ఈ కరివేపాకు ఎవరూ తినరు. దీన్ని చెత్తలా భావించి తీసి పక్కనపెడతారు.వంటల్లో కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది. అంతేకాకుండా ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. కాబట్టి కరివేపాకును చెత్తగా భావించడం మానుకోండి. అలానే కరివేపాకు జుట్టు ఎదుగుదలకు కూడా తోడ్పడుతుందట. 

జీర్ణక్రియ: కరివేపాకు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే కరివేపాకు నీటిని తాగితే మంచిది. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకు ఇది పరిష్కారం చూపుతోంది.

రక్తం శుద్ది: కరివేపాకులోయాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. వీటి కారణంగా ముక్కులు మరియు క్రేనీల నుండి విషం బయటకు వెళుతుంది. కరివేపాకు శరీరం ... రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఇలా జరగాలంటే ఉదయం లేవగానే కాఫీ, టీలకు బంద్ చేసి, కరివేపాకు నీరు తాగాలి. ఇది మొత్తం శరీరాన్ని శుభ్రం చేసి, కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

జుట్టు ఆరోగ్యం: కరవేపాకు జుట్టు ఎదుగుదలకు తోడ్పతుంది. ఇందులో జుట్టు ఎదుగుదలకు ప్రేరేపించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా జుట్టు బలంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది. మీ జుట్టు విపరీతంతా రాలుతుంటే కరివేపాకు నీటిని ట్రై చేయండి.

చెడు కొలెస్ట్రాల్:  కరివేపాకు ప్రధానంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంపై చెడు కొవ్వు ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. కరివేపాకు నమలడం ఇష్టం లేకపోతే కరివేపాకు నీళ్లు తాగొచ్చు.

రోగనిరోధక వ్యవస్థ: కరివేపాకులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలానే ఇందులోశక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ బలపరుస్తాయి. మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగండి.

బరువు: కరివేపాకులో పీచుపదార్థాలు ఎక్కువగా.. కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గేవారికి ఇది సహాయపడుతుంది. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కరివేపాకు నీటిని తాగండి. దీని ద్వారా శరీరంలో జీవక్రియలు పెరిగి కొవ్వులు కరుగుతాయి.

చర్మ ఆరోగ్యం : కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కరివేపాకు తీసుకోవడం వల్ల అందులో ఉండే ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మంచి మెరిసే చర్మాన్ని పొందాలంటే ఉదయాన్నే కరివేపాకు నీటిని తాగండి