లోదుస్తుల్లో అక్రమంగా బంగారం తరలింపు

లోదుస్తుల్లో అక్రమంగా బంగారం తరలింపు

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రోజూ అక్రమ బంగారాన్ని పట్టుకుంటూనే ఉన్నారు కస్టమ్స్ అధికారులు. అక్రమార్కులపై ఎంత నిఘా పెట్టినా విదేశాల నుంచి బంగారాన్ని రవాణా చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 5వ తేదీ బుధవారం కస్టమ్స్ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాక్స్ ప్రొఫైలింగ్ ఆధారంగా ఇవాళ ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 373 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 23 లక్షల రూపాయలుగా గుర్తించారు అధికారులు.

నిందితుడు తన ప్యాంటు, లోదుస్తులలో బంగారం దాచివుంచాడు. ప్యాంటు, లోదుస్తులలో రెండు పొరల మధ్యలో బంగారాన్ని పేస్ట్ రూపంలో తరలిస్తున్నాడు. అనుమానంతో కస్టమ్స్ అధికారులు పాక్స్ ప్రొఫైలింగ్ నిర్వహించి ప్రయాణికుడిని పట్టుకున్నారు. బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక పాక్స్ ప్రొఫైలింగ్ అనేది విమానాశ్రయంలో ప్రయాణీకుల కార్యకలాపాలు.. వారి స్వభావం ఆధారంగా వారి బ్యాగేజీని అనుకోకుండా తనిఖీ చేయడాన్ని సూచిస్తుంది.