శంషాబాద్ ఎయిర్పోర్టులో 8 కేజీల బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్పోర్టులో 8 కేజీల బంగారం పట్టివేత

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో శనివారం రోజు (ఆగస్టు 12న)  సుమారు 8 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న విమానంలో ఒక ప్రయాణికుడు వద్ద 2 కేజీల బంగారం, అదే విమానంలో మరో ప్రయాణికుడు వద్ద నుంచి1.78 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు ప్రయాణికులు బ్యాంకాక్  నుంచి అక్రమంగా గోల్డ్ తీసుకొస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 

షార్జా నుండి శంషాబాద్ కు చేరుకున్న మరో విమానంలో ఒక ప్రయాణికుడి వద్ద నుంచి 2.17 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి శంషాబాద్ కు చేరుకున్న మరో ప్రయాణికుడి వద్ద 2.05 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా నలుగురు ప్రయాణికులు అక్రమంగా గోల్డ్ ను తీసుకొస్తుండగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

శనివారం  ఒక్క రోజు దాదాపు 8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. స్వాధీనం చేసుకున్న గోల్డ్ విలువ సుమారుగా రూ.4 కోట్ల 86 లక్షల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నలుగురు ప్రయాణికులపై కేసు నమోదు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.