శంషాబాద్లో అక్రమ బంగారం పట్టివేత

శంషాబాద్లో అక్రమ బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టు బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి కువైట్ నుండి హైదరాబాద్ కు వచ్చిన ఈజిప్ట్ దేశస్తుడు తన లోదుస్తుల్లో బంగారం పెట్టుకుని తరలించేందుకు ప్రయత్నించగా చాకచక్యంగా పట్టుకున్నారు. ఎయిర్ పోర్టులో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేయడంతో అక్రమ గోల్డ్ స్మగ్లింగ్ గుట్టురట్టు అయ్యింది. ఈజిప్ట్ దేశస్తుడి నుంచి 800 గ్రాముల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ మార్కెట్ లో దాదాపు రూ.41 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

అక్రమ బంగారం రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు శంషాబాద్ లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానిత వ్యక్తులను క్షుణ్నంగా చెకింగ్స్ చేస్తున్నారు. కానీ కొందరు కంత్రీగాళ్లు మాత్రం ఎప్పటికప్పుడు టెక్నాలజీకి అప్ డేట్ అవుతూ అధికారుల కళ్లు కప్పేందుకు యత్నించి అడ్డంగా బుక్కవుతున్నారు.