పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా CV ఆనంద బోస్ ప్రమాణం

పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా CV ఆనంద బోస్ ప్రమాణం

పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా సీవీ ఆనంద బోస్ బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు న్యాయమూర్తి ప్రకాశ్ శ్రీవాస్తవ.. ఆనంద బోస్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమానికి బెంగాల్ సీఎం మమత బెనర్జీ, స్పీకర్ బిమన్ బెనర్జీ, మంత్రులు హాజరయ్యారు. 1977 బ్యాచ్ కు చెందిన రిటైర్డ్ IAS అధికారి అయిన బోస్.. ఈ నెల 17 న పశ్చిమబెంగాల్ కొత్త గవర్నర్ నియమితులయ్యారు. ఇవాళ  గవర్నర్ గా  బాధ్యతలు స్వీకరించారు.

ఆనంద్ బోస్ గతంలో ఐఏఎస్ అధికారిగా పలు జిల్లాల్లో కలెక్టర్ గా .. కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖల్లో సెక్రటరీ, ప్రిన్స్ పల్ సెక్రటరీ, యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ .. చీఫ్ సెక్రటరీ తదితర కీలక బాధ్యతలను నిర్వర్తించారు. విద్య, అటవీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ వంటి శాఖల్లో కూడా ఆనంద బోస్ సేవలందించారు.