ఎయిర్‌హోస్టెస్‌ వలలోపడ్డ వ్యాపారవేత్త

ఎయిర్‌హోస్టెస్‌ వలలోపడ్డ వ్యాపారవేత్త

హనీ ట్రాప్.. అందాలతో ఎర వేయడం, ముగ్గులోకి దింపడం.. తర్వాత వీడియోలతో బ్లాక్ మేయిల్ చేసి డబ్బులు కాజేయడం ప్రస్తుతం ఆన్ లైన్ మోసాల్లో ఇదొకటి.  హానీ ట్రాప్ కేసులు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. లేటెస్ట్ గా హైదరాబాద్ లో హనీ ట్రాప్ జరిగింది. ఓ ఎయిర్ హోస్టేస్(కనిష్క) బిజినెస్ మాన్ కు వల వేసి లక్షలు దండుకుంది. తన అందాలతో వ్యాపార వేత్తను ముగ్గులోకి దింపి తనతో గడిపింది.

వ్యాపార వేత్తకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలు తీసింది. రిసార్ట్ కు రమ్మని వ్యాపార వేత్తను తన భర్త సహాయంతో గన్ తో బెదిరించింది ఎయిర్ హోస్టెస్. దీంతో ఆ వ్యాపారి రూ.20 లక్షలు ఇచ్చుకున్నాడు. మరో కోటి రూపాయలకు బాండ్ కూడా రాయించుకుంది. దీంతో చేసేదేం లేక ఆ వ్యాపారి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ లోపే ఆ కిలాడీ మరో ఎన్ఆర్ఐని టార్గెట్ చేసింది. దీంతో పోలీసులు  కనిష్క కపుల్స్ ను అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. హనీ ట్రాప్  కేసులో పట్టుబడ్డ ఎయిర్ హోస్టెస్ కనిష్క ఆమె భర్త విజయ్ కుమార్ హోటల్ బిజినెస్ లో నష్టాలు రావడంతో ఇలా ఈజీ మనీ కోసం పక్కా  ప్లాన్ వేసుకుని బడాబాబులను టార్గెట్ చేస్తున్నారు. అలానే  ఆ వ్యాపార వేత్తతో పరిచయం పెంచకున్న కనిష్క అతనిని వలలోకి దింపింది.  ఒక రోజు ఇన్వెస్టిమెంట్ పేరుతో వ్యాపార వేత్తనుంచి రూ. 10లక్షలు తీసుకుంది. వ్యాపార వేత్తకు మత్తు కలిపి చనువుగా ఉన్నట్లు ఫోటోలు, వీడియోలు తీసింది.  ఓ రోజు రిసార్ట్ కు రమ్మని  ఆ  వీడియోలు చూపించి తన భర్త సహాయంతో డమ్మీ గన్ తో ఆ వ్యాపార వేత్తను బెదిరించారు. అతని నుండి వాళ్లు మరో రూ.10 లక్షలు తీసుకున్నారు. మరో కోటి రూపాయలకు బాండ్ కూడా రాయించుకున్నారు. దీంతో ఆ వ్యాపార వేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.