
- యాప్ లింక్ మెసేజ్ పంపి..మోసగించిన సైబర్ నేరగాళ్లు
- జగిత్యాల పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల టౌన్ కు చెందిన ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 40 వేలు కొట్టేశారు. జిల్లా కేంద్రానికి చెందిన రమేశ్ కు చెందిన ఆర్ బీఎల్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉంది. శుక్రవారం తన క్రెడిట్ లిమిట్ ను పెంచుతామని నో బ్రోకర్ యాప్ ద్వారా మెసేజ్ వచ్చింది. మెసేజ్ లోని నంబర్ కు కాల్ చేశాడు. అనంతరం తన క్రెడిట్ లిమిట్ రూ. 41వేలను మరింత పెంచుతామని చెప్పి ఓ యాప్ లింక్ పంపించాడు. అది ఓపెన్ చేయగానే అకౌంట్ లోని రూ.40,997 కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో సైబర్ నేరగాళ్లు మోసం చేశారని తెలుసుకొని బాధితుడు వెంటనే స్థానిక టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు.