కరీంనగర్ జిల్లా: సైబర్ క్రిమినల్స్ : రూ. 15 లక్షలు కొట్టేశారు..

కరీంనగర్ జిల్లా: సైబర్ క్రిమినల్స్ : రూ. 15 లక్షలు కొట్టేశారు..
  • క్రెడిట్‌‌‌‌ కార్డ్‌‌‌‌ లిమిట్‌‌‌‌ పెంచుతామంటూ కురవి ఆలయ ఉద్యోగి నుంచి రూ. 8.72 లక్షలు
  • ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ పేరుతో మందమర్రిలోని మహిళ నుంచి రూ. 6.37 లక్షలు

కురవి/కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌, వెలుగు : క్రెడిట్‌‌‌‌ కార్డ్‌‌‌‌ లిమిట్‌‌‌‌ పెంచుతాం, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ అని నమ్మించిన సైబర్‌‌‌‌ నేరగాళ్లు ఇద్దరి నుంచి మొత్తం రూ. 15 లక్షలకు పైగా కాజేశారు. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్‌‌‌‌కు చెందిన కట్ల జగన్నాథం మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కురవి వీరభద్రస్వామి ఆలయంలో సీనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఈ నెల 26న మధ్యాహ్నం 60034 47660 అనే నంబర్‌‌‌‌ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌‌‌‌ చేసి.. తాము హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌ నుంచి కాల్‌‌‌‌ చేస్తున్నాము.

 మీ క్రెడిట్‌‌‌‌ కార్డ్‌‌‌‌ లిమిట్‌‌‌‌ పెంచుతామంటూ చెప్పి జగన్నాథం సెల్‌‌‌‌కు ఓ లింక్‌‌‌‌ పంపించారు. అతడి దానిని ఓపెన్‌‌‌‌ చేయడంతో ‘వై కార్డ్స్‌‌‌‌’ అనే యాప్‌‌‌‌ డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ అయింది. తర్వాత గుర్తుతెలియని వ్యక్తి చెప్పినట్లుగా యాప్‌‌‌‌లోని అన్ని పేజీలను జగన్నాథం ఓకే చేశాడు. ఫోన్‌‌‌‌ చేసిన వ్యక్తి జగన్నాథం దగ్గర ఎన్ని కార్డులు ఉన్నాయో తెలుసుకున్న అనంతరం ఫోన్‌‌‌‌ పెట్టేశాడు.

అనుమానం వచ్చిన జగన్నాథం గంట తర్వాత తన క్రెడిట్‌‌‌‌ కార్డ్స్‌‌‌‌లోని డబ్బులను చెక్‌‌‌‌ చేసుకోగా.. హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ నుంచి రూ. 1.30 లక్షలు, ఎస్‌‌‌‌బీఐ నుంచి రూ. 1,61,353, యాక్సిస్‌‌‌‌ నుంచి 3,87,093, ఇండస్‌‌‌‌ ఇండ్‌‌‌‌ నుంచి రూ. 1,94,498 కలిపి మొత్తం రూ. 8.72 లక్షలు డెబిట్‌‌‌‌ అయినట్లు గుర్తించాడు. వెంటనే తనకు వచ్చిన నంబర్‌‌‌‌కు తిరిగి కాల్‌‌‌‌ చేయగా.. సాయంత్రంలోగా జమ అవుతాయని చెప్పారు.  డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన జగన్నాథం కురవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జగన్నాథం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కురవి ఎస్సై సతీశ్‌‌‌‌ తెలిపారు. 

మందమర్రిలో మహిళ నుంచి...

కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌, వెలుగు : ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ పేరుతో మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ప్రాణహిత కాలనీకి చెందిన ఓ మహిళ నుంచి సైబర్‌‌‌‌ నేరగాళ్లు రూ.6.37 లక్షలు కాజేశారు. టౌన్‌‌‌‌ ఎస్సై రాజశేఖర్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు అవుతాయంటూ ప్రాణహిత కాలనీకి చెందిన ఓ మహిళ సెల్‌‌‌‌కు మే 3న ‘థా అండ్‌‌‌‌ రిపేర్‌‌‌‌’ పేరుతో ఓ లింక్‌‌‌‌ వచ్చింది. అది నిజమేనని నమ్మిన మహిళ లింక్‌‌‌‌ను క్లిక్‌‌‌‌ చేయగా.. టెలిగ్రామ్‌‌‌‌ యాప్‌‌‌‌లో చేరాలని సైబర్‌‌‌‌ నేరగాళ్లు సూచించారు. 

యాప్‌‌‌‌లో చేరగానే ఆమె అకౌంట్‌‌‌‌లో రూ.5 వేలు డిపాజిట్‌‌‌‌ అయినట్లు చూపించారు. తర్వాత మరింత డబ్బు ఇన్వెస్ట్‌‌‌‌ చేయాలని లేకపోతే నష్టపోతారంటూ నమ్మించారు. దీంతో సదరు మహిళ తన డబ్బులతో పాటు తన ఫ్రెండ్స్‌‌‌‌ నుంచి తీసుకొని మొత్తం రూ.6,37,760 సైబర్‌‌‌‌ నేరగాళ్లు చెప్పిన అకౌంట్లకు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేసింది. 

మహిళను నమ్మించేందుకు సైబర్‌‌‌‌ నేరగాళ్లు నేషనల్‌‌‌‌ స్టాక్‌‌‌‌ ఎక్చేంజ్‌‌‌‌, నేషనల్‌‌‌‌ క్రైమ్స్‌‌‌‌ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌కు చెందినవిగా కొన్ని నకిలీ పత్రాలను పంపించారు. నేరగాళ్లు మరింత డబ్బు అడగడంతో మోసపోయినట్లు గుర్తించిన మహిళ మందమర్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్‌‌‌‌ తెలిపారు.