ట్రేడింగ్ పేరుతో భారీగా సైబర్ మోసాలు.. రూ. 5 కోట్లు కొట్టేశారు

ట్రేడింగ్ పేరుతో భారీగా సైబర్ మోసాలు.. రూ. 5 కోట్లు కొట్టేశారు

హైదరాబాద్:  రోజురోజుకూ సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. సులువుగా డబ్బులు సంపాదించేందుకు కొందరు కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులను క్షణాల్లో కాజేస్తున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు ఎక్కవయ్యాయి.  న్యాయవాదులు, డాక్టర్లు, ప్రభుత్వ అధికారులకూ కూడా సైబర్ నేరగాళ్ల బెడద తప్పడంలేదు. 

ఇటీవల 3 రోజుల్లో రూ.5 కోట్ల సైబర్ మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్లు. ట్రేడింగ్ పేరుతో ఓ డాక్టర్ నుంచి రూ. 2.5 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు. ఫెడెక్స్ కొరియర్ పేరుతో మరికొంతమంది బాధితుల నుంచి రూ. 2.5 కోట్లు కొట్టేశారు. మరో కేసులో ఓ కంపెనీ ఈ-మెయిల్ హ్యాక్ చేసి రూ. 22 లక్షలు మోసానికి పాల్పడ్డారు. దీంతో బాధితులు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మోసాలపై కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు.. లక్నోకు చెందిన ఓ చీటర్ తోపాటు వెస్ట్ బెంగాల్ కి చెందిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.