కాల్ సెంటర్ల నుంచి సైబర్​క్రైమ్ ​ఆపరేషన్

కాల్ సెంటర్ల నుంచి సైబర్​క్రైమ్ ​ఆపరేషన్
  • కాల్ సెంటర్ల నుంచి సైబర్​క్రైమ్ ​ఆపరేషన్
  • టెలీ కాలర్స్​తో ఫోన్లు​ చేయిస్తూ ఫ్రాడ్​ 
  • ఢిల్లీ, మధ్యప్రదేశ్​లో సెంటర్లను ట్రేస్​ చేసిన తెలంగాణ పోలీసులు
  • ఫోన్​ కాల్స్​తో అప్రమత్తంగా ఉండాలని సూచన

హైదరాబాద్, వెలుగు: ‘‘హలో సార్​.. మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నం.. అంటూ క్రెడిట్​కార్డు, పర్సనల్ లోన్, హోమ్​లోన్, ఇన్సూరెన్స్ ల పేరుతో చేసే ఫోన్​కాల్స్​అన్ని నిజమైనవి కాకపోవచ్చు. మీతో మాట్లాడుతున్న టెలీ కాలర్స్​సైబర్​నేరగాళ్లు ఆపరేట్​చేస్తున్న కాల్​సెంటర్ల నుంచి ఫోన్​చేస్తుండొచ్చు. అలర్ట్​గా ఉండాల్సిందే. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలను తెలంగాణ పోలీసులు ట్రేస్​చేశారు. ఐటీ కంపెనీల తరహా కాల్‌‌‌‌‌‌‌‌సెంటర్స్ ఏర్పాటు చేస్తున్న సైబర్​నేరగాళ్లు కన్సల్టెన్సీల ద్వారా నిరుద్యోగ యువతను తక్కువ జీతాలకు టెలీకాలర్స్​గా రిక్రూట్​చేసుకుంటూ వాళ్లతో ఫ్రాడ్​చేయిస్తున్నారు. బ్యాంక్​కస్టమర్ల డేటాను ఏజెన్సీల ద్వారా కొంటున్న ఈ దుండగులు.. ఆ వివరాలతో టెలీకాలర్స్​ద్వారా బ్యాంక్​నుంచి మాట్లాడుతున్నాం.. అంటూ ఫోన్లు చేయించి డబ్బు కాజేస్తున్నారు. ఇలాంటి తరహా కాల్​సెంటర్లు ఢిల్లీ, కోల్‌‌‌‌‌‌‌‌కతా, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌, యూపీతో పాటు దేశవ్యాప్తంగా సుమారు15 చోట్ల పని చేస్తున్నట్లు తెలంగాణ సైబర్​క్రైమ్​పోలీసులు గుర్తించారు. 

ఢిల్లీలో రెండు కాల్‌‌‌‌‌‌‌‌ సెంటర్స్‌‌‌‌‌‌‌‌పై  రైడ్స్
డబ్బు పోగొట్టుకున్నామంటూ.. పోలీసులను ఆశ్రయించిన బాధితుల వద్ద నుంచి ఫోన్ నంబర్స్  తీసుకున్న సైబర్​క్రైమ్​పోలీసులు వాటిని ట్రేస్​చేశారు. ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న రెండు కాల్‌‌‌‌‌‌‌‌సెంటర్స్‌‌‌‌‌‌‌‌పై సోమ, మంగళవారం రెండు రోజులు రైడ్స్​చేశారు. 24 మందిని అదుపులోకి తీసుకొని, ట్రాన్సిట్ వారెంట్‌‌‌‌‌‌‌‌పై హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చారు. కాగా ఈ రైడ్స్​లో పోలీసులు కీలక అంశాలు గుర్తించారు. కాల్‌‌‌‌‌‌‌‌సెంటర్స్ నిర్వహణపై ఆధారాలు సేకరించారు. గత నెల17న కూడా ఇలాంటి కేసునే తెలంగాణ పోలీసులు ట్రేస్​చేశారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎల్‌‌‌‌‌‌‌‌ క్రెడిట్​కార్డు హోల్డర్లను మోసం చేస్తున్న16 మంది సభ్యుల ఢిల్లీ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని ఫేక్ కాల్​సెంటర్స్ పై దాడులు చేసి 1865 సిమ్​కార్డులను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్​ కస్టమర్ల డేటా సంపాదించి ఫేక్​కాల్స్​చేస్తూ.. బల్క్​మేసేజ్ లు, లింక్​లు పంపుతూ అకౌంట్స్​లో డబ్బులు కాజేస్తున్నట్లు  గుర్తించారు.

టెలీ కాలర్స్​కు అనుమానం రాకుండా 
టెలీ కాలర్స్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న ఉద్యోగులకు సైబర్​నేరగాళ్లు ఎలాంటి అనుమానం రానివ్వడం లేదు. బ్యాంకుల క్రెడిట్​కార్డులు, లోన్లు, బీమా తదితర థర్డ్‌‌‌‌‌‌‌‌ పార్టీ ఏజెన్సీలుగా నమ్మించి టెలీ కాలర్స్​తో కస్టమర్లకు కాల్ చేయిస్తున్నారు. కస్టమర్ల బ్యాంక్​అకౌంట్​పూర్తి వివరాలు కొట్టేసి.. ఖాతాలో ఉన్న డబ్బును వారి ఈ వ్యాలెట్‌‌‌‌‌‌‌‌లోకి డైవర్ట్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్నారు. ఇలాంటి నేరాల్లో సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్న రైడ్స్​లో టెలీకాలర్స్​మాత్రమే చిక్కుతున్నారు. సైబర్ క్రిమినల్స్ నిర్వహిస్తున్న కాల్ సెంటర్స్‌‌‌‌‌‌‌‌లో తాము పనిచేస్తున్న విషయం తెలుసుకుని వాళ్లు భయాందోళనకు గురవుతున్నారు.