వాట్సాప్ నెంబర్ కు లింక్.. ఓపెన్ చేస్తే రూ. 10 లక్షలు మాయం

వాట్సాప్ నెంబర్ కు లింక్.. ఓపెన్  చేస్తే  రూ. 10 లక్షలు మాయం

రోజురోజుకూ సైబర్‌ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎంత అవగాహాన కలిపించినప్పటికీ ఎక్కడో చోట ప్రజలు సైబర్‌ క్రైమ్ బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లాలో  ఓ చికెన్ వ్యాపారి దాదాపుగా 10 లక్షలు పోగొట్టుకున్నాడు.  ఈ ఘటన గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  హోల్ సేల్ చికెన్ వ్యాపారి చేసే దేవేందర్ కు వాట్సాప్ నెంబర్ కు యూనియన్ బ్యాంక్ ఏపీకె లింక్ పంపారు సైబర్ నెరగాళ్లు. వెంటనే దేవేందర్ దానిని ఓపెన్ చేశాడు. దీంతో అతని బ్యా్ంకు ఖాతా నుండి రూ. 9.60 లక్షలు మాయమయ్యాయి. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.