పెట్టుబడుల పేరుతో రూ.712 కోట్లు దోపిడీ : మన నిరుద్యోగులకు చైనా వల

పెట్టుబడుల పేరుతో రూ.712 కోట్లు దోపిడీ : మన నిరుద్యోగులకు చైనా వల
  • పెట్టుబడుల పేరుతో రూ.712 కోట్లు దోపిడీ : మన నిరుద్యోగులకు చైనా వల
  • అధిక లాభాలంటూ టెలీగ్రామ్  యాప్ లో  నిరుద్యోగులకు  వల
  • రూ. 712 కోట్లు కొల్లగొట్టిన చైనీయులు 
  • దోచుకున్న డబ్బు దుబాయ్ నుంచి చైనాకు వెళ్లింది
  • చిక్కడ పల్లి  బాధితుడి ఫిర్యాదుతో ముఠా గుట్టు రట్టు 
  • రూ. 28 లక్షలు పోగొట్టుకున్న యువకుడు 
  • నిందితులకు ఉగ్రవాద సంస్థలతో లింకులు
  • హైదరాబాద్ సీపీ సీవీ అనంద్ 

హైదరాబాద్ :  చైనా కేంద్రంగా  పెట్టుబడులు పేరుతో సైబర్ నేరగాళ్లు  భారీ మోసానికి పాల్పడ్డారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. శనివారం (జులై 22న) హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారీ స్కామ్ వివరాలను ఆయన  వెల్లడించారు. ‘చిక్కడపల్లి కి చెందిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న  ఈ ముఠాలోని 9 మందిని అరెస్టు చేశాం. హైదరాబాద్, లక్నో, ముంబై, అహ్మదాబాద్ కు చెందిన పలువురు ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠా నుంచి బాధితుడికి టెలిగ్రామ్ యాప్ ద్వారా రేట్ అండ్ రివ్యూ పేరుతో పార్ట్ టైం జాబ్ ఆఫర్ వచ్చింది. తర్వాత ట్రావెలింగ్ బూస్ట్ 99. కామ్ లో బాధితుడు రిజిస్టర్ చేసుకున్నాడు.

https://www.youtube.com/watch?v=Yubxl_shjmM

తొలుత ఈ వెబ్ సైట్  ద్వారా బాధితుడికి ఐదు టాస్కులు వచ్చాయి. ముందు  వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే బాధితుడికి 866 రూపాయల ప్రాఫిట్ వచ్చింది. ప్రతిసారి బాధితుడు ఇన్వెస్ట్ చేసిన నగదు ఆన్ లైన్  వాలెట్లో డిస్ ప్లే  అయ్యేది. ఈ విండోలో చూపించిన అమౌంట్ ను మాత్రం బాధితుడు విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేదు. అలా మొత్తం బాధితుడు రూ. 28 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. బాధితుడు పోగొట్టుకున్న 28 లక్షల రూపాయలు ఆరు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినట్లుగా గుర్తించాం. ప్రధానంగా రాధిక మార్కెటింగ్ పేరుతో ఉన్న అకౌంట్లోకి ముందుగా డబ్బుంతా ట్రాన్స్ఫర్ అయ్యేది ఆ తర్వాత అక్కడి నుంచి  పలు బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లోకి నగదును ట్రాన్స్ ఫర్ చేసేవారు. ఈ డబ్బంతా పలు మార్గాల్లో క్రిప్టో కరెన్సీ ద్వారా దుబాయ్ నుంచి చైనా వెళ్లింది. తీవ్రవాదులు ఉపయోగించే క్రిప్టో వెబ్ సైట్ కు  వెళ్లినట్లు తేలింది. 

ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. నగదు బదిలీ కోసం బ్యాంక్ అకౌంట్లతో పాటు కంపెనీల షెల్ అకౌంట్లు రెడీగా ఉంచుకున్నారు. రాధిక మార్కెటింగ్ ఖాతాను  హైదరాబాద్ కు  చెందిన మహమ్మద్ మున్వర్ మెయింటేన్ చేస్తున్నట్టుగా గుర్తించాం. ఈ మొత్తం ఫ్రాడ్ లో చైనాకు చెందిన లు ల్యో, నాన్ యే, కెవిన్ జూన్ లు ప్రధాన నిందితులు. ఒక్కో అకౌంట్ ఓపెన్ చేసినందుకు రెండు లక్షల రూపాయలు చైనా ముఠా ఇస్తోంది. ఇలా అహ్మదాబాద్ కు చెందిన ప్రజాపతే 65 అకౌంట్లను ఓపెన్ చేయించి చైనీయులకు అప్పగించాడు. వీటి ద్వారా సుమారు 125 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగాయి. ఇతర అకౌంట్ ల నుండి మరో  712 కోట్ల రూపాయల నగదు బదిలీ జరిగింది. 17 మొబైల్ ఫోన్లు రెండు ల్యాప్ టాప్ లు 22 సిమ్ కాళ్లు నాలుగు డెబిట్ కార్డులు స్వాధీనం చేసుఉన్నట్లు తెలిపారు.

https://www.youtube.com/watch?v=G5W04ym8qx0